పుట:Dvipada-basavapuraanamu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

బసవపురాణము

గలవండ్రు దర్శనంబులు నాఁగఁ గొన్ని :
కలిసియుండనె మున్నొకండొకఁ డందు
దర్శనంబులు గల్గఁ దలఁచిరేనియును
దర్శనం బది వేఱె తత్త్వరూపంబు ;
తల ప నీశ్వరపదతల్లీయసౌఖ్య
ఫలకారణమె కర్మపాశ బంధంబు ?
నిటు గాక యుభయము నేక మండ్రేని
యటుగాదు వో నిటలాక్షుభక్తునకు 980
"ధర నన్య దేవతాస్మరణమాత్రమున
నిరువదెన్మిదిగోట్లు నరకంబు లొందు '
నన శ్రుతు లందును వినరె ? బాపనికి
దినకరపావక దిక్పాలకులను
హరివిరించ్యాదుల నఖిలదేవతల
ధర మూఁడు సంధ్యలఁ దాఁ గొల్వవలయుఁ ;
గొలువక తక్కినఁ బొలిసె బ్రాహ్మ్యంబు ;
కొలిచెనేనియు భక్తి వొలిసెఁ గావునను
బ్రాహ్మణుఁ డేనియు భక్తుఁ డె ట్లగును ?
బ్రాహ్మణుఁ డెట్లగు భక్తుఁ డేనియును ? 990
మావిడిబీజంబు మహిమీఁద విత్తఁ
గా వే మగునె పెక్కు గథలేమి చెప్ప ?
సహజలింగైక్యనిష్టాయుక్తి భక్తి
బహుదేవతాసేవ బ్రాహ్మణపథము ;
కులసతియట్లు నిశ్చలయుక్తి భక్తి ;
వెలియాలియట్టు లవ్విప్రమార్గంబు ;
కాదేని నందిముఖ్య స్థితిఁ గొలిచి
యాదిదేవుఁడ దైవ మనుమంత్ర మెఱిఁగి
తా రుద్ర వేషంబుఁ దాల్చెనేనియును
వారక యట్ల తా వర్తింపవలదె ? 1000
యిలువేలుపైన సర్వేశ్వరుఁ డుండఁ
బలువేలుపులఁ గొల్వఁ బాడియే చెపుమ ?