పుట:Dvipada-basavapuraanamu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

35

దైవం బనఁగ లేదు తా బహురూపు,
దాని కాచార్యుండు ధరఁ గర్మజడుఁడు ,
దానికి మంత్రంబు దాను గాయత్రి,
ప్రతిదిన క్రియ కర్మబంధంబు వేష
మితరేతరము మోక్షహేతువే తలఁప ?
నది కాక షడ్దర్శనాతీత మైన
మదనారిసద్భక్తి మార్గంబు వినుము : 950
శ్రుతి "విశ్వతశ్చక్షుఋత" యంచుఁ బొగడు
సుతుల మీఱి యతిసూక్ష్మరూపంబు
ఆదికి నాది నిత్యానందమూర్తి
శ్రీదివ్యలింగమూర్తియ సుదైవంబు ;
నట్టియీశ్వరు నాత్మఁ బట్టించి చేతఁ
బెట్టంగఁ జాలిన పృథుదయామూర్తి
ప్రకటింప "నగురో రధిక” మనఁ బరగు
సకలస్వరూప మాసమయసద్గురుఁడు
మంత్రంబులకు రాజమంత్రమై వెలయు
మంత్రంబు దానికి మఱి షడక్షరియు 960
భవదూర మగు జటాభసితరుద్రాక్ష
సవిశేషమోక్షానుసారి వేషంబు
భువి జన్మపాపౌఘభూజకుఠార
మవిరళ సత్క్రియాష్టాంగసద్భక్త
సందర్శనంబుల సకలపాపములు
డిందు మోక్షాంగన వొందుఁ ; గావునను
నిది ఫలప్రాప్తి యిం కిట మీఁద లింగ
పద సేపనోత్కృష్టభవ్యసౌఖ్యంబు
ఫల మిట్టి దని చెప్ప భావింప శ్రుతుల
తలమె జీవన్ముక్తి తత్త్వాత్మకంబు : 970
కావున వేఱె మార్గంబుగాఁ జూడు
భావింప బ్రాహ్మ్యంబు భవునిభ క్తియును ;