పుట:Dvipada-basavapuraanamu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

బసవపురాణము

తుదముట్టె" ననుచు సంతోషాబ్ధిఁ దేలి
చేలులుఁ జుట్టములు నచ్చెరువంది వినఁగఁ
గలతెఱఁ గంతయుఁ గడు వేడ్కఁ దెలిపి 750
యున్నెడఁ- గోమలియుదరంబులోన
నున్నమహాత్మునిహృన్నలినంబు
దాన యై వెలిగెడు తత్పరంజ్యోతి
వానిఁ బ్రబోధించి "వచ్చినపనులు
మఱచితే" యనవుఁడు నెఱిఁగి సద్భక్తి
[1]యఱుకువ గాకుండ సాష్టాంగ మెరఁగి
ప్రీతిఁ బుత్త్రుఁడు మోడ్పు, జేతులతోడ
నాతల్లిగర్భంబునం దుదయించె ;
నర్ధోదయమునంద యతనిలో నున్న
యర్దేందుమౌళి గుప్తాకృతిఁ దాల్చి 760
యంగంబుపైఁ గడు సాంగంబు గాఁగ
లింగసాహిత్యంబు లీల నొనర్చె ;
వచ్చిన త్రోవ యెవ్వరుఁ గానకుండ
నెచ్చోట నుండియో యేతెంచెఁ దపసి
యిది యేమొకో !” యని యింటివారెల్లఁ
బదరుచు నంత విభ్రాంతు లై చూడ
ముడిచినమడుపుఁ గెంజడముడినడుమ
మృడునిచందంబులు వెడవెడ దోఁపఁ
గట్టిన వెలిపొత్తి కచ్చడం బెందుఁ
బుట్టనిరుద్రాక్ష భూషణంబులును 770
రాగికుండలములు రత్నకంబళియు
యోగదండంబును నొకచేత గొడుగు
బూదిబొక్కసమును బొలుపారుమేను
బూదిపై నొప్పు త్రిపుండ్రరేఖలును
దళతళ మను మెర్గుపలువరుసయును

  1. తక్కువ.