పుట:Dvipada-basavapuraanamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

27

[1]నెరివు మాన్పింపవే యేమియు నొల్ల
న న్నెంత కెత్తుకో నున్నదో కాక
యెన్నఁడు విందుమే యిట్టిగర్భముల !”
ననుచుఁ దా నచ్చోట నచ్చోట నిలిచి
తనువు శ్రమంపడఁ దనయింటి కరిగి
పాన్పు పై నుస్సని పరితాప మంది
తన్పుగా నార్ద్రచందనవారిఁ దోఁగి
నెవమునఁ గనుమూసి నిద్రఁ బొందుడును
నువిదకుఁ గలవోలె నుక్షవల్లభుఁడు 730
[2]జంగమలింగవేషం బొప్పఁ దాల్చి
యంగన కి ట్లని యానతి యిచ్చె :
“నీమనస్తాపంబు నీవగ మాన్పఁ
గా మించి వచ్చితిఁ గమలాయతాక్షి !
నీకడ్పులో నున్నయాకుమారుండు
లోకపావనమూర్తి గాక కేవలుఁడె ?
యాదివృషభము శిలాదునికొడుక ;
యాదేవదేవుని యానతిఁ జేసి
భక్తహితార్థ మై ప్రభవించు నీకు
వ్యక్తిగాఁ జెప్పితి వగవకు మింకఁ 740
బుట్టెడు : బుత్త్రుండు ; పుట్టఁగఁ దడవ
పెట్టుమా బసవఁడ న్పేరు పెంపార"
నని యానతిచ్చిన నంత మేల్కాంచి
కనువిచ్చి చూచుచుఁ గాన కెవ్వరిని
“ఈతఁడు మననందికేశుండు దాన
యేతెంచెఁ గానోపు నింతయు నిజము
బ్రదికితి ; నాజన్మఫల మెల్ల నేఁడు

  1. బాధ.
  2. చరలింగము ; జీవరూపమునఁ జరించు శివుఁడు ; శివభక్తుఁడు ; జంగమ జంగమ లింగశబ్దములు కేవల శివభక్తవాచకములుగనే పూర్వవాఙ్మయమున నుప యుక్తము లైనవి.