పుట:Dvipada-basavapuraanamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

బసవపురాణము

మునుకొని యు ట్లూర్ధ్వముఖము లై తనర
నిశ్చలకోదండ నిజగతి నున్న
పశ్చిమనాళ సంభవ మైనయట్టి
నాదంబునకుఁ జొక్కి నగముపై మ్రొక్కి
మోదంబునకుఁ జిక్కి ముందఱ నిక్కి
సరినూర్ధ్వముఖసహస్రదళాంబుజాత
మరయ నధోముఖ మై మించి వెలుఁగ
దివ్యుఁ డై షోడశాంత వ్యోమచంద్ర
భవ్యసుధాపానపారవశ్యమున700
నాతతంబుగఁ బరంజ్యోతిస్స్వరూప
మై తనవెలుఁగ వెల్గై వెల్గుచుండఁ
బలుగుఱా ప్రతిమగర్భంబులోపలను
వెలిఁగెడుదీపంబు విధమునుబోలెఁ
బాండురాంగం బైన పడఁతిగర్భమునఁ
బోఁడిగా వెలుఁగుచుఁ బుత్త్రుఁ డీక్రియను
దగిలి శివధ్యానతత్పరత్వమున
మొగిఁ దల్లి కడుపులో మూఁడేఁడు లున్న-
సుతభరా క్రాంత యై మతి శ్రమం బంది
సతి దొంటి నందికేశ్వరుగుడి కేఁగి 710
“నోములు గీములు వేములఁ గలిపి
నీమర్వు సొచ్చితి నిఖిలలోకేశ !
మఱుఁగుసొచ్చినయట్ల మన్నించి నన్ను
మెఱయింపు సుతు నీగి మే లయ్యె నేఁడు
పున్నెంబు సేసిన పొలఁతులు నెలల
నెన్నఁ దొమ్మిది మోచి కున్నలఁ గండ్రు;
అల్లన మూఁడేఁడు లయ్యె న న్నింత
యల్లటపెట్టె దోయన్న : నే నెఱుఁగ
దుర్భరం బైన యీయర్భకు వలని
గర్భంబు కర్కటిగర్భంబు వోలె 720
నరయంగ నీయిచ్చు వరములు సాలు