పుట:Dvipada-basavapuraanamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

25

ననఁగ మానినిగర్భ మంతకంతకును
నినుపారి తనుపారి పెనుపారి పొదలి
నవమాసములు నిండ నందీశమూర్తి
నవక మై కడుపులోనన మవ్వమొందె.
జనని గర్భావాస మను గుహంతరమ
తనసమాధికి సుఖస్థాన మై పరఁగ
సిద్ధపద్మాసనాసీనత నతివి
శుద్ధాత్ముఁ డై భూతశుద్ధికిఁ జొచ్చెఁ ; 670
గడవ నూకుచు నుదకముఁ బాఱఁజల్లి
యడర నెబ్బంగినో యగ్ని దా నేర్చె ;
బూది దా రాఁజదు పొగయదు తాను
నూఁదండు ముట్టించె నొక్కదీపంబు ;
నొప్పుదీపమునఁ దా నున్నయిల్లెల్లఁ
గప్పు గాలకయుండఁ గాల్చె లోపలన ;
“యిలఁ గాలు మోపండు నిట్టిబిడ్డండుఁ
గలఁడమ్మ !" యనుచు శత్రులును మిత్రులును
దమతమ పట్లను దా రుండ నోడి
భ్రమితు లై కనుకనిఁ బాఱుచునుండ 680
నచ్చుగాఁ దాఁ జొదళాబ్జంబుఁ గడచి
వచ్చి త్రికూటంబు వసుధపై నిలిచి
సచ్చరిత్రత సుప్తసర్పంబుఁ జోఁపి
క్రచ్చఱ షడ్డళకమలంబు నొంది
కర మర్ధి దశదళకమలంబుఁ బొంది
పరగ ద్వాదశదళపద్మంబుఁ జెంది
షోడశదళపద్మసురుచిరసౌఖ్య
క్రీడావిలోలుఁ డై కేరియాడుచును
దాఁటి యాద్విదళ పద్మంబునఁ దన్ను
నాఁటించి సచ్చిదానందంబు నూని 690
చను నధోముఖ మగు షట్కమలములు