పుట:Dvipada-basavapuraanamu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

23

మఱునాఁడు నందిని మజ్జనం బార్చి,
గుఱు తైన చందనకుసుమంబు లిచ్చి,
మెత్తనివస్త్రముల్ మెయినిండఁ గప్పి,
యుత్తమాభరణంబు లురుగజ్జియలును 610
నందెలు గంటలు నలవడఁ గూర్చి,
పొందుగాఁ బసిఁడికొమ్ములు గొరిజియలు
వెట్టి ఫాలంబునఁ బట్టంబు వెలయఁ
గట్టి, నందికి నలంకారంబు సేసి,
యక్షతధూపదీపాదు లొనర్చి,
యాక్షణంబునఁ బంచభక్షముల్ కుడిపి,
పులగంబు ముందటఁ బ్రోవుగాఁ బోసి,
పులకండమును నెయ్యిఁ గలిపి యర్పించి,
పరమమాహేశ్వర ప్రతతికి నెల్లఁ
బరిణామ మంద సపర్యలు సేసి, 620
నందీశ ! నందీశ ! నవనందినాథ !
ఇందుకళాధరు నెక్కుడుఁగుఱ్ఱి !
నాయన్న ! నాతండ్రి : నాయాలఱేఁడ !
నీయట్టిసద్భక్తు నీయట్టిపుత్త్రు
ఖ్యాతిగా నొక్కనిఁ గరుణించితేని
ప్రీతి యెలర్ప నీ పే రిడుదాన”
ననుడు నప్పుడు మాదమాంబకు నంది
జనులెల్ల నెఱుఁగఁ బ్రసాదంబు వెట్ట
నక్కున మోమున నాప్రసాదంబు
మక్కువ నెక్కొల్పి మఱి మౌళిఁ దాల్చి 630
మ్రొక్కి నిజువాసమునకు నేతెంచె;
నెక్కుడు శుభచేష్ట లెదురుకొనంగ
నంత నెప్పటికంటె ననురాగరసము
వింతవేడుక పుట్టి వెలఁదియుఁ బతియు
లీల వర్తిల్ల, ము న్భూలోకమునకు