పుట:Dvipada-basavapuraanamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

బసవపురాణము

నరుదెంచె రయమున ; .నంత నిక్కడను ; 580
గురుతరం బైన శ్రీగిరి పశ్చిమమున
నరనుతం బగుచుఁ గర్ణాటదేశ మనఁ
గడు నొప్పు నందుఁ బ్రఖ్యాతసద్భక్తి
సడి సన్నహింగుళేశ్వరభాగవాటి
యను నగ్రహారంబునందు విఖ్యాతి
మనుచుండు మండెఁగ మాదిరా జనఁగ;
నతని పరమసాధ్వి యతివ మాదాంబ.
సతతశివాచార సంపన్న ధన్య
[1] కొత్తడి నెల్లను గొండొక్క పెద్ద
యుత్తమురాలు ధర్మోపేతగాత్రి ; 590
యెల్లవారలకంటె మొల్లంబునందు
నల్లవో యనుజీవనంబునఁ బొదలి
కొడుకులు లేమికిఁ గడు దుఃఖి యగుచు
వెడనోము లన్నియు వేసర నోమి,
యాద్యులు వొత్తంబులందెల్ల వెదకి
“హృద్యంబుగా నందికేశ్వరునోము
కామ్యార్థసిద్ధికిఁ గారణం" బనుచు
సమ్యగ్ర్వతస్థితి సతికిఁ జెప్పుటయు
నమ్మహాత్ములు సెప్పినట్లుగా గుడికి
నిమ్ములఁ జని నందికేశ్వరుఁ జూచి 600
సర్వాంగములు ధర సంధిల్ల మ్రొక్కి
'సర్వజ్ఞ నందికేశ్వర ! దయాంభోధి ! '
యంచుఁ బ్రస్తుతి చేసి యతిభక్తి మ్రొక్కి
యంచిత వ్రతచర్య లాచరింపుచును
నిమ్ముల సోమవార మ్మాదిగాఁగఁ
దొమ్మిదిదినము లుత్సుకవృత్తి నోఁచి,

  1. (రూ. క్రొత్తడి) పతివ్రతాసమూహము.