పుట:Dvipada-basavapuraanamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

15

రూపించి ధర్మస్వరూపు లై మహిమ
నేపారుప్రమథగణేంద్రులం దెల్ల
మక్కువ పెక్కువ మద్భక్తియుక్తి
యెక్కువగాఁగ నీ కిచ్చినవాఁడఁ ;
గాన మిక్కిలిభక్తి గలయట్టిపుత్త్రు :
గాని శిలాదుండు దా నొల్ల ననియె ;
నిచ్చినవర మింక నేఁ దప్పనేర ;
నచ్చెరు వంద మా యనుమతిఁజేసి 390
పుట్టు ద్వితీయ శంభుం డనఁ బుడమి"
నటిద కా"కని యానందలీలఁ

—: నందికేశ్వరుని యవతారము :—


బుట్టె నయోనిపంభూతుఁ డై యతని
కిట్టలంబుగ నందికేశ్వరుఁ డనఁగఁ ;
బుట్టఁగఁ దోడనె పుట్టె మద్భక్తి :
పుట్టక యటమున్న పుట్టె మచ్చింత ;
పరమతత్త్వామృతం బయ చన్నుఁబాలు
గురుపదధ్యానవిస్ఫురణయ వెన్న
వేదాంతసూక్తుల వెడ దొక్కుఁబల్కు
లాదిశివాచార మదియ వర్తనము 400
గాను మదీయాంఘ్రికమలంబు లాత్మ
లో నిడుకొని భక్తిలోలత్వ మెసఁగ
బలువిడిఁ బాఱునేఱుల నట్టనడుమ :
జలికాల మెల్లఁ బుక్కిలిబంటి నిలిచి,
యేకపాదాంగుష్ఠ మిలమీఁద "మోపి,
యాకసంబునకు ముఖాంబుజ మొగ్గి,
వర్షంబు భోరన వఱుగొని కురియ
హర్షంబుతోడ నల్లాడక నిలిచి,
మేదినిఁ దల మోపి మీఁదికి రెండు
పాదంబులను నెత్తి, పంచాగ్నినడుమఁ 410