పుట:Dvipada-basavapuraanamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

బసవపురాణము

దలఁచిన డెందంబు దాపంబుఁ బొందఁ
బలికిన నోరెల్లఁ బటపటఁ బగులఁ
జూచినఱెప్పలు సుఱచుఱఁ గమర
నేచినయెండల నెడపక నిలిచి.
భువియు వడంక సంభోనిధు లింక
రవిశశుల్ గ్రుంకఁ గూర్మంబు దలంక
దిక్క రీంద్రులు ద్రుంగ దిక్కులు గ్రుంగ
నక్కులాద్రులు స్రగ్గ నహిపతి మ్రొగ్గ
దిక్పతుల్ బెదర నద్దివియెల్ల నుదర
వాక్పతి యదర నధ్వరములు సెదర 420
హరి తల్లడిల్ల బ్రహ్మాండముల్ డొల్ల
ధర నుల్కలును డుల్ల సురలు భీతిల్ల
నపరిమితం బైన యతివీర ఘోర
తప మాచరించెఁ జిత్రము చిత్ర మనఁగ ;
నంత భయభ్రాంతులై యజాచ్యుతులు
సంతాపచిత్తు లై సకలదేవతలు
గ్రక్కున మాయున్నకడకు నేతెంచి
మ్రొక్కి సాష్టాంగు లై మోడ్పుఁగే లమర
" దేవ ! దేవేశ్వర ! దేవతారాధ్య !
దేవచూడామణి ! దేవాధిదేవ ! 430
పరమభట్టారక ! పరమస్వతంత్ర !
సరమేళ : పరమాత్మ : పరమ ! పరుండ !
శంకర ! పంకజసంభవాద్యమర
శంకర ! దురితభయంకర ! యభవ !
యక్షయ : సర్వజ్ఞ : యఖిలలోకైక
రక్షక ! ధక్షమఖక్షయ : దక్ష !"
యనీ మమ్ముఁ గీర్తింప నచ్యుతాదులను
గనుఁగొని యేమును గన్నుల నవ్వి ,
“యింత సంతాపింప నేఁటికి మీకు