పుట:Dvipada-basavapuraanamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

బసవపురాణము

“యభిమతం బగు పుత్త్రు నర్థి విత్తేవి
యభవ ! నీ భక్తియం దణుమాత్ర మైనఁ
దక్కువ గలిగినఁ దల ద్రుంచివైతు
నక్కుమారునకు నీ వడ్డ మై యున్న ;
నట్టేని గొడుకు ని; మ్మటు గానినాఁడు
నెట్టణ నే నొల్ల నీయిచ్చువరము ;” 360

—: శివుఁడు శిలాదునకు వర మొసఁగుట :—


నంచు విన్నప మాచరించుడు నతని
సంచితభక్తికి సంప్రీతిఁ బొంది
యాదిసృష్టికి మున్న నాది యై పరఁగు
నాది మదీయాంశ మగు వృషభంబు
ధర్మరూపమునఁ గృతయుగంబు నందు
ధర్మంబు నాల్గువాదంబుల నడచు ;
రమణతోఁ ద్రేతాయుగమునను ధర్మ
మమరఁగ మూఁడువాదములను నడచు;
జగములో ద్వాపరయుగ మందు: బాద
యుగమున ధర్మనియుక్తిమై నడచుఁ ; 370
బొసరుచుఁ గలియుగంబున నొక్కవాద
మునను జరించు ధర్మనిరూఢి వెలయఁ ;
దగిలి యిమ్మాడ్కిని ధర్మస్వరూప
మగుట లోకహితార్థుఁ డగు నట్లుఁగాక
పూని ద్వితీయశంభుం డనుపేరఁ
దా నిత్యుఁ డై పరమానందలీల
మాకు వాహన మై ప్రమథముఖ్యుఁ డయ్యు
గోకులపతి యయ్యు శ్రీకరమహిమ
వెలసిన యయ్యాదివృషభేంద్రుఁ జూచి
“నలి శిలాదునకును నందీశుఁ డనఁగఁ 380
బుట్టుము; నీవొండెఁ బుట్టంగవలయు
నట్టుగా కేనొండెఁ బుట్టంగవలయు ;