పుట:Dvipada-basavapuraanamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

13

—: శిలాదుని తపస్సు :—


యాది ననేకయుగాలనాఁడు
నాదరికమున శిలాదుఁ డనఁగఁ
దాపసముఖ్యుండు దప మొనరించె;
శ్రీపర్వతంబు నైకృత్యభాగమునఁ 330
గందమూలాదులు గాలియు నీరు
నిందురశ్ములును దినేశరశ్ములును
నాహారముగఁ ద్రికోట్యబ్దముల్ సలిపి,
సాహసంబుస మఱి శతకోటియేఁడు
లావంతశిల తన కాహారముగను
భావించి "ఘోకతపం బర్థిఁ జేయ
నతనికిఁ బ్రత్యక్షమై యేము నిలిచి
“మతి నిష్ట మెయ్యది మము వేఁడు" మనిన
నత్తఱి నతఁడు సాష్టాంగుఁ డై మ్రొక్కి
చిత్తంబులోఁ బ్రీతి సిగు రొత్తి నిగుడ 340
సర్వజ్ఞ ! పశుపతి ! శంకర ! శర్వ !
సర్వలోకేశ్వర ! శాశ్వత ! సాంబ !
అవధారు వేదవేదాంతాపగమ్య !
అవధారు విన్నసం బాశ్రితసులభ :
శ్రీమన్మహాదేవ : శివలింగమూర్తి !
యేమిటఁ గొఱఁతయే స్వామి ! మీకృపను
నై నను నా కొక్కయభిమతం బైన
దాని వేఁడెద మహాదాని ! యీక్షణమ ;
నీయట్టివానిని విజభక్తజనప
రాయ త్త ! సుతుఁగా దయామతి నొసఁగు” 350
మనవుడు నతనికి నభిమతార్ధంబు
నొనరింప నున్నంత వనజాక్షి ! వినవె !
అంతటఁ బోవక యాశిలాదుండు
నెంతయు భక్తితో నిలఁ జాఁగి మ్రొక్కి