పుట:Dvipada-basavapuraanamu.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

బసవపురాణము

బాపురే ! మాతండ్రి భక్తివర్ధనుఁడు !
బాపురే మా యయ్య ఖ్యాపిత శౌర్య !
నల్లవో బసవయ్య నందీశమూర్తి !
నల్లవో బసవ యనశ్వరకీర్తి !
గరళంబు దొల్లి జదద్ధితార్థముగ
హరుఁ డారగించుచో నట మ్రింగ వెఱచి
కాదె విషం బుంచెఁ గంఠంబునందు!
నా దేవు మహాత్మ్య మదియెంత పెద్ద?
కాలకూటముకంటెఁ గడు నుగ్రవిషము
తా లెక్క చేయక దండనాయకుఁడు 550
అంచితభక్త హితార్థంబుగాఁగ
వంచనలే కారగించెఁ గడ్పార:
నమృతంబు ద్రావియు నమరసంఘంబు
సమసుప్తిఁ బొండెడు జగ మెల్ల నెఱుఁగ;
బసవయ్యఁ జూడుఁ డా విసముద్రావియును
నసమానలీల దివ్యాంగుఁడై నిలిచె :”
ననుచు లోకము లెల్ల నచ్చెరువంది
వినుతింప బోయలు విభ్రాంతిఁ బొంది
సంతాపచిత్తు లై సంస్తుతింపుచును
నంతంత సాష్టాంగు లై ప్రణమిల్లి 560
“యభయమే బసవయ్య ! యతికృపాంభోధి :
యభయమే బసవయ్య యద్భుతచరిత :
యిమ్మెయి సరివారమే బసవయ్య !
తమ్ముఁ బఱుప మీకుఁ దలఁప శౌర్యంబె ?
పోల దుర్జనితోడి పొందునకంటె
జాల మేలండ్రు సజ్జనవిరోధంబు ;
కావున మము నెట్లుఁ గాచి రక్షింపు !
మావికలతఁద్రోచి దీవనఁ బొందు !
దేవ ! దెసయు దిక్కు నీవ మా” కనుచు !