పుట:Dvipada-basavapuraanamu.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

247

వేవిధంబుల నిట్లు విన్నవించుడును 570
జూచె దయాదృష్టిఁ, గాచె విడ్పడఁగఁ,
ద్రోచె వాదములెల్ల . నేచెఁ బ్రఖ్యాతి,
మాపె బోయల పెంపుఁ జూపెఁ బ్రసాద
మోపి లే దనినూకెఁ, బాపె బోయలను;
నిలిచెఁ జలింపక, తలఁచెఁ బ్రస్తవము.
గెలిచె, సద్భక్తి మైఁ బొలిచె, బీరమునఁ
బేర్చె, భక్తావలిఁ గూర్చె, నాద్యోక్తిఁ
దీర్చె, సన్మార్గంబు నోర్చెఁ దర్కమునఁ
బండించె నిశ్చలభక్తి లోకముల
నిండించె బసవయ్య నిర్మలకీర్తి. 580

—: జగదేవ దండనాయకుని కథ :—


వెండియు జగదేవ దండనాయకుఁడు
నిండారుసద్భక్తి నిధి కర్మయోగి
యభిమతలీలమై విభవంబు మెఱసి
శుభకార్య మాచరించుచు నొక్కనాఁడు
నేతెంచి "వీరమాహేశ్వర తిలక :
ప్రీతియెలర్ప విభూతిఁ గై కొనుము ;
అసలార మా యింట నారగించినను
బసవనమంత్రి ! యే బ్రదుకుదు" ననిన
నగుమొగం బలరార జగదేవమంత్రి
నొగిఁ జూచి బసవయ్య “యొండేమి చెప్ప 590
సర్వజ్ఞునెట్టణ శరణులరాక
కోర్వఁగ నెమ్మెయి నోపుదే" యనిన
నవుగాక యనుచు రయంబున నేఁగి
వివిధపక్వాన్నది వితతులు గూర్చి
సరసర బసవయ్య సనుదేకమున్న
గర మభిషేకంబుఁ గావింత మనుచు
జానగుప ట్లల్కి- సద్భక్తియుక్తిఁ