పుట:Dvipada-basavapuraanamu.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

245

దాసీజనముల విలాసినీజనులఁ
దతవితతాది వాద్యవిశారదులను
జతురగాయక నిజ స్తవపాఠకులను
బండిత నర్తక పరిహాసకులను
మండితసత్కని మండలి నెల్లఁ
బంతులు సాగఁగఁ బంచి, వారలకు
వింతవేడుక పుట్ట విషము వోయింపఁ
గాలకూటము వారిపాలికి నెయ్యి
పాలునై యుండఁగ బసవన్న మఱియుఁ * 520
కూడ నేనుఁగులకు గుఱ్ఱంబులకును
వేడుకఁ బోయించే విషమెల్ల సమయ ;
నడలుచుబోయలు గడగడ వడఁక
మృడుభక్త మండలి మెచ్చి కీర్తింపఁ
బ్రమథకారుణ్య విస్ఫారప్రసాద
విమల పుష్పాంచితవృష్టి పైఁ గురియ
గగనస్థు లై రుద్రగణములు సూడ
నొగి దివ్యదుందుభు లొక్కట మ్రోయ
బిజ్జలుఁ డద్భుతో పేతుఁడై మ్రొక్క
యజ్జనౌఘంబు వాయక జయవెట్ట 530
‘భవలతాంచితదాత్ర పరమపవిత్ర :
శివగణస్తోత్ర విశిష్టచారిత్ర :
సదమలగాత్ర ప్రసాదైక పాత్ర :
విదితసజ్జనమిత్ర విజ్ఞాననేత్ర
ప్రోద్గతసూత్ర మహద్గురుపుత్త్ర
సద్గుణైకచ్ఛత్ర జంగమక్షేత్ర :
యతిదయామాత్ర దుఃఖాబ్దివహిత్ర :
ప్రతివాదిజై త్ర సద్భక్తి కళత్ర !
చన " నరిర్మిత్రం విషం పథ్య" మనఁగఁ
బనుపడుశ్రుత్యుక్తి బసవ ! నీ కయ్యె; 540