పుట:Dvipada-basavapuraanamu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

183

నలిజూదమునమూర్ఖు నగజేశుఁ గూడె;
వేఁటాడి రాముండు వెలఁది గోల్పడియె ;
వేఁటాడి యెఱుకు డా విశ్వేశుఁ గలసెఁ ;
బరసతీవశ్యు లై నరపతుల్ ద్రుంగ
బరసతీవశ్యుఁ డై హరుఁ గూడె నంబి ; 600
చంపి మాండవ్యుండు సరిఁ గొర్తఁబడియెఁ ;
జంపి చండుండు ప్రసాదంబుఁ గనియె ;
బొంకిన బ్రహ్మకు భువిఁ బుట్టుమాలె :
బొంకి చిర్తొండండు బొందితోఁ జనియె ;
గొఱియ మ్రుచ్చని శూద్రకుఁడు నఱకువడెఁ ;
గఱకంఠుగణనంది గలసెఁ దెర్వడిచి
రమణ “రాజ్యాంతే నరక" మన ముక్తి
విమలతఁ గనిరి చేరమయుఁ జోడండుఁ :
గాన యెట్లును నమార్గం బనరాదు.
తా నీశ్వరార్థ మన్తలఁపునఁ జేసి 610
ధర నధర్మో ధర్మతాం వ్రజే” త్తనఁగ
హరునివాక్యము గాన యట్టిద పథము ;
నిన్నియు నన నేల ? యిందఱకంటెఁ
గన్నద బ్రహ్మయ్య గతి యెట్టి దనిన :
నెప్పుడు జంగమం బేతెంచు నింటి
కప్పుడకాని పోఁ డసహాయలీల ;
నిది వగ లిది రాత్రి యెట్లొకో యనుచు
మదిలోన లే దణుమాత్రంబు భయము :
నదియును శివభక్త సదనంబ యేని
ముదమునఁ బేర్సెప్పి మ్రొక్కుచువచ్చు : 620
నిలిల్లుఁ దప్పక యితరాలయముల
నెల్ల యర్థము దెచ్చు నిహపరంబులకు ;
దూరమైనట్టి లుబ్ధులయిండ్లు సొచ్చి
వారలఁ జరితార్థవంతులఁ జేయ