పుట:Dvipada-basavapuraanamu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

బసవపురాణము

జనియించినట్టి ప్రాక్తనపురుషుండు
నన నేల కడువిస్మయము గాదె ! తలఁప
ముట్టిన త్రవ్విన మెట్టిన ఠావు
పట్టినకైదువు ల్వసిఁడిమయంబు ;
ప్రాకటంబుగ నిన్ను రక్షింపఁ దలఁచి
కాక బ్రహ్మయ్యకు శ్లాఘ్యమె పదార్థంబు 630
లెక్కకు మిక్కిలి లేకున్నఁ దప్పు ;
తక్కిన బండరు లెక్కలు సూడు,"
మనుచు నబ్బసవఁ డత్యనురాగలీలఁ
గనుఁగొని బండరు కవిలియ సదువ
నక్కజం బందుచు నవనీశుఁ డుండె.
నిక్కడ బ్రహ్మయ్య యింటి కేతేర
నుదతియుఁ బతికి నుత్సుకత దుల్కాడ
నెదురేఁగి యడుగుల కెరఁగి కన్నంపు
ముట్టులుఁ జేతిసొమ్మును నందుకొనుడుఁ
జట్టన బ్రహ్మయ్య జంగమావలికి 640
ముదమంది ధరఁ జాఁగిమ్రొక్కెఁ దత్ క్షణమ.
ముదితయుఁ దాను సముదితసద్భక్తి
మించి వెలుంగంగఁ బంచభక్ష్యములు
నంచితంబైన దివ్యాన్నపానములు
గావించినట్టి పక్వంబులు జంగ
మావలి కంత సమర్పణ సేసి
వారి ప్రసాదసుధారసవార్ధి
నారంగఁ దేలుచు నాదట మఱియు
ధనధాన్యవస్త్ర వాహనభూషణములఁ
దనిపి జంగమలసత్కరుణాభివృద్ధిఁ 650
గన్నదబ్రహ్మయ్య మున్నెట్టు లట్ల
సన్నుతభక్తి మహోన్నతి నుండెఁ.
గన్నద బ్రహ్మయ్య ఘనచరిత్రంబు