పుట:Dvipada-basavapuraanamu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

బసవపురాణము

పఱతెంచి సొచ్చుడుఁ బై పడి వాఁడుఁ
బఱతేరఁ గిన్నరబ్రహ్మయ్య గాంచి
“పోవక నిలునిలు బొప్ప : యీగొఱియ
దేవాలయముఁ జొచ్చెఁ జావున కోడి ;
యింకఁ జంపుట దోస ; మిట్లు గాదేని
కొంకక వెలసెప్పి కొనుము రెట్టైన ;
మృడుభక్తు లొప్పింతురే శరణన్న
జడనరులై నను జంపంగనీరు ;
చరజీవులకు నెల్లఁ జావును నొప్పి
సరియకాదే యెందుఁ జర్చించి చూడ : 60
నీకు దీనిని జంప నేమమే ! చెపుమ;
యాకాంత దీనినే యచ్చోత్తినదియె ?
పడయరానిది భువిఁ బసిఁడియ కాదె?
కడుఁగాక మాడైన నడిగిన నిత్తు
నదెకొమ్ము" నావుడు “నక్కటా ! యిట్టి
చదురుండుఁ గలఁడయ్య జగతి లోపలను ;
గుడి సొచ్చు మడి సొచ్చు గుండంబు సొచ్చు
విడుతురే గొఱయల విలిచినవారు ?
త్రోవ నదెట్టులు దొలఁగకవచ్చు ?
నీవకా కిబ్బువి నీతిమంతుఁడవు 70
ఏఱుఁగ మే మెన్నఁడు నిటువంటి వెందుఁ ;
గొఱగాదు దడసినఁ గోపించు లంజె ;
'పెట్టెద వెల' యని బిగిసెడుఁ బెద్ద :
యిట్టి దయాపరుఁ డెచ్చోటఁ గలఁడు ?
చరజీవులకునెల్ల జావును నొప్పి
సరియె తా ననియెడుఁ జర్చింప నట్ల
మనుజుల ప్రాణంబు మఱి వేయుమూడ
లననేల యిన్నియు నతఁడు బొంకెడినె ?
వేయిచ్చియైనను విడిపించు గొఱియ