పుట:Dvipada-basavapuraanamu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

127

నిట యుండు మీ" వని యట యేఁగి, తాను
గుటిలవేషంబున గొల్ల నిభాతి 1400
బఱపువ్రేళ్ళును, మొద్దు పాదముల్, గుజ్జు
చిఱుతొడలును, దొప్ప చెవులును, బరడు
ప్రక్కలు, బీరనరములును, జిదక
ముక్కును, ముడిబొమల్. మొగిదోనికడుపుఁ
బొక్కిళ్ళువోయిన చెక్కిళ్ళు, వలుఁద
బొక్కిఱొమ్మును, బెద్దనిక్కినమెడయుఁ ,
బల్లమీసములు, నేర్పడు కాయకన్నుఁ ,
బిల్లిగడ్డంబును, నల్లనిమేనుఁ,
బ్రాఁకువట్టినపండ్లు, బ్రద్దచేతులును,
వీఁక కాళ్లును, నడ్డివీఁపును దనర 1410
ములుగత్తి యుచ్చుఁ గోకలుఁజూఁడుఁగొడుపు
మొలతిత్తి నిడి, దొడ్డమొలకచ్చగట్టి,
గాలిదప్ప(బ్బ)ఱ వెండ్రుకల్ దూలియాడ
నీలవెట్టుచు నుఱిఁ మెఱ్ఱఁ జూచుచును,
గుక్కలఁ బిలుచుచు, ఱిక్క పెట్టుచును,
నెక్కొన నొరగాల నిలుచుచుఁ జనుచు,
గొడ్డలి బరిగమ్మి గూటికుండయును
దుడ్డుఁ గోలయుఁ బట్టి తొడిఁదొడిఁ గొన్ని
మేఁకపిల్లలఁ దనచాఁకిట నిఱికి
వీఁక దబ్బఱవాట్ల విసరివ్రేయుచును 1420
గొన్ని మేఁకల రొప్పికొని వచ్చి తుమ్మ
నున్న కాయలు రాల్చియును, నంతఁ బోక
యిమ్ములఁ దనమీఁదికొ మ్మొక్క గొల్ల
గ్రమ్మఱ నఱకంగఁ గలుషించి చూచి
“నామీఁదికొ మ్మేల నఱికెద వోరి ?
[1]గామిడి గొల్ల ! యీకాననంబునను

  1. గామిది = గడుసరి.