పుట:Dvipada-basavapuraanamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

బసవపురాణము

డనురక్తి ముకుళితహస్తు మ్రొక్కి
“పరగు నీనూతనప్రాక్తనభక్త
వరగణంబులలోన వచియింప జూప
నిల నిట్టి ముగ్ధలు గలరొకో ? యనుచు
నలి దీటుకొనఁగ విన్నపము సేయుడును
బరామానురాగసంపదఁ దేలి సోలి
కరమర్థి మఱిముగ్ధగణముల కథలు 460
పసరింపఁ దల చి సద్భక్తి బండారి
బసవయ్య యాచెన్న బసవని కనియె :

—: రుద్రపశుపతి కథ :—


వ్యక్తం బెఱుంగవే యయ్యళయూర
భక్తుండు మును రుద్ర పశుపతి నాఁగఁ ?
బ్రథిత మౌ నాదిపురాణమం దబ్ధి
మథనావసర మొక్క కథకుండు సదువఁ
గమలజ కమలాక్షు లమితదై త్యాదు
లమరులు సెడి పాఱ నం దుద్భవించి
పొరి నజాండములెల్ల దరికొని కాల్చు
గరళంబు మ్రింగె శ్రీకఱకంఠుఁ డనిన 470
నారుద్రపశుపతి యాలించి 'భర్గుఁ
డారగించుట నిక్కమా విషం' ? బనుడు
“ననుమానమా ! త్రావె హరుఁడు విషంబు
బనుగొన నటమీఁదిపను లెఱుంగ' మన
విని యుల్కిపడి వీఁపువిఱిగి "హా ! చెడితి "
నని నేలఁ బడి పొర్లి "యక్కటా : నిన్ను
వెఱ్ఱిఁ జేసిరిగాక ! విశ్వేశ ! యెట్టి
వెఱ్ఱివా రైనను విషముఁ ద్రావుదురె ?
బ్రదుకుదురె ? విషమ్ముపాలైన వార ?
లిది యెట్టు వినవచ్చు ; నేమి సేయుదును ? 480
నిక్క మెవ్విధమున నిన్నెకా కెఱుఁగ ;