పుట:Dvipada-basavapuraanamu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

93

చేకూరె నిట్టిలంజెఱిక మీరాత్రి :
బండారి ! నీయాన పసిబిడ్డనాఁట
నుండియు శ్రీగిరి నుండుదు ; నచట
ననుపమకదళీవనాంతర బిల్వ
వనముల నేకాంతవాసంబు నందుఁ
బన్నుగా నఱకాలఁ గన్నును నొసలఁ
గన్నును గలమహాగణములు గలరు ,430
చూతుము గాని యెచ్చోట ము న్నిట్టి
భూతిశాసనధారిఁ బొడగాన మేము ;
పొలుపగు పచ్చవిభూతిపూఁతయును
దెలుపగు రుద్రాక్షములు నెఱ్ఱజడలు
నంతకుఁ దగినసర్వాంగకచ్చడము
వింత యై యున్నది యింతివేషంబు ;
నిట్టిలాంఛనధారి నిట్టివిరాగి
నిట్టినిష్ఠాశాలి నే మనవచ్చు !
నింతి నొక్కతెఁ జెప్పనేల తత్పతికి
సంతతంబును బరిచర్యలు సేయు 440
లలన లందఱు నట్టిలాంఛనధరులు :
చెలువలమహిమంబు శివుఁడె యెఱుంగు.”
ననుచుఁ దత్సతుల లాంఛనములు నచటి
తనమిండతనమును దప్పక చెప్పఁ-
బలుమాఱు నడుగుచు నలి జంగమములు
సెలఁగుచు నొండొరుఁ జేవ్రేసి నవ్వ
బసవం డసమసముల్లసనుఁ డై చెన్న
బసవని దెసఁజూచి బసరింపఁ దొడఁగె.
“నిట్టి నెట్టణభక్తి యిట్టిముగ్ధత్వ
మిట్టిమహత్త్వంబు నెందును గలదె ? 450
నిక్క మీశ్వరుఁ గాని నిజ మెఱుంగమిని
ముక్కంటిభక్తులు ముగ్ధలు గారె?"
యని ప్రశంసింపంగ నాచెన్న బసవఁ