పుట:Delhi-Darbaru.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అశోకుని శిలా సూపము.

43


యేని త్రుప్పుపట్టకుండుటయు దీనిమీఁది శాసనములందలి లిపు లు కొంచెమైనం దఱుగుడు వడి మాసిపోక స్పష్టముగ గను పడుచుండుటయు మిక్కిలి వింతగ నున్నది. ఈ సంభముమీఁది శాసనమును బట్టి యిది విష్ణువునకు సమర్పింపఁబడినట్లు తెలియు చున్నది. కావున దీని చివర గరుత్మంతుని విగ్రహముండియుం డును. మహమదీయులవలన నిర్నూలనమందియుండును. కాని యీస్తంభమునిలుపుటకు ముఖ్యోదేశము సప్తసింధువు తీరమున బాహ్లికులను హిందూ రాజులోడించి తరుముటను దెలుపుటయే.

అశోకుని శిలాస్తూపము.

దర్శనీయమగు ఢిల్లీలోని చిత్రములలో నశోకుని శిలా స్తూపము' మఱి యొక్కటి. ఇది మొట్ట మొదట పాంచాల దేశము నందలి అంబాలా మండలములోని జగంద్రియను గ్రామమున కేడుమైళ్ల దూరమున నుండెడిది. దానిని ఫిరోజు షాహ పెకలించి తెచ్చి ఢిల్లీయందుఁ దననగరున నాటించుకొనియెను. ఇతని కాలపుచరిత్రను వ్రాసియుంచిన జయా-ఉద్దీ - బాగ్ని క్రిందిరీతిని దీనికథను 'జెప్పుచున్నాఁడు.

“స్తూపమును పరుండ బెట్టుటకు నుత్తమమార్గమును బాగుగ యోజించిన పిడప నా ప్రాంతములందలి " కాల్బలమును నాశ్విక సైన్యమును దక్కుంగల జనసామాన్యమును నచ్చటికీ, రావలసినదని ముదలయాయెను. అప్పనికి నర్హమగు సర్వవిధో పకరణములను బ్రతిమాసవుఁడును దేవలసినదనియు నుత్తరువు,