పుట:Delhi-Darbaru.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

ఢిల్లీ న గ ర చరిత్రము.


ఇచ్చట ఒక గోడమీఁద షహజహాను, బహదూరు షహాల స్వహస్తాక్షరములు చెక్కఁబడియున్నది.

ఈమసీదు గదులలో నొక్కెడ మహమ్మదీయుల కత్యంత 'పవిత్రమగు మహమ్మదు మహాపురుషుని జ్ఞాపక చిహ్నములైన వస్తువులు భద్రము చేయఁబడియున్నవి. ఇందు మూలా చార్యుల పాదరక్షలును, రాతియందు చెక్కిన యాతని చరణా కృతియును, నమూల్యరజత పేటిక యందు మహాదరముతో గుప్తీక రించిన మహమ్మదు గడ్డమునుండి తీసిన రక్తవర్ణపు వెండ్రుక యును గలవు. ఏడవ శతాబ్దమున వ్రాయఁబడిన కోరానుగ్రంథపుఁ బ్రతియొక్కటిగూడ నీ చిన్న గది కలం కార ములలో నొక్కటిగ నున్నది.

జుమా మసీదును గుణించి రస్సెలను నొక ఐరోపియను గృహస్థుఁడు " ఈకట్టడపు విశుద్ధశోభయు, దీనిరచన యందలి ప్రమాణ సౌందర్యంబును, మఱియు నిర్మాణము నందలి యుదా త్తకల్పకతయు, మన క్రైస్తవ ప్రార్థనమందిరముల శుద్రమును దరిద్రమును నగు స్వరూపములతోఁ బోల్చిచూచిన 'భేదముతో దలవంచు కొననలసి నంతటి వైపరీత్యము గానుపించు”నని వ్రాసి యున్నాడు.

లోహస్తం భ ము..

కుతుబ్ మినారు సమీపమున మఱియొక ప్రేక్షణీయ 'మగు వస్తువుగలదు. దాని పేరు మనమిదివఱికే వినియున్నారము.