పుట:Delhi-Darbaru.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

386

దర్బారులచరిత్రము.


కిని, మహారాజ చక్రవర్తిగా మా మంగళాశీర్వాదము లొసంగి ఇండియా సామ్రాజ్యము నెడల మాకుగల గాడ వాత్సల్య మును అందలి క్షేమాభ్యుదయముల విషయమున మాకు ఉన్నట్టియు సర్వదా ఉండు నట్టియు, శ్రద్ధను దృఢముగా స్పష్ట పఱుచుచున్నాము.

మా ప్రభుత్వపు ద్వితీయ సంవత్సరమైన వేయిన్ని తో మ్మ న్నూట పదునెకండవ సంవత్సరపు డిశంబరు నెల ది 12న తేదిని, ఢిల్లీ పట్టణములో మాయాస్థానమునుండి సాదరు చేయబడినది.

శ్రీమహా రాజు చక్రవ ర్తి గారిని భగవంతుని రక్షించు గాత:""*[1]

జయజయధ్వానములు చెలంగె. సైనికులు గౌరవ చిహ్నముగఁ దమయాయుధములఁ దగురీతి నిలిపిరి. సభయంత యు లేచి నిలువంబడియె. 101 ఫిరంగులు జార్జి సార్వభౌముఁడ య్యెనని నల్గిక్కులకుఁ జూటె. దర్బారు రంగమునకు "నెలుపట నుండిన సైన్యములు సంతోషమును జూప మందు లో నించిన బందూకుల ప్రేల్చిరి. అంతయు నొక్క-యానంద ఘోష, సము ద్రం బయ్యెను.

పిదప గవర్నగు జనరలు గారగు హాస్టింగు ప్రభువు చక్ర వర్తిగారి విశేషోత్తరువులఁ బ్రకటించిరి.

......................................................................................

  1. * Quotation from Fort St. George Gazette.