పుట:Delhi-Darbaru.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ జార్జిపట్టాభి షేకము.

387


అందు ఇతర వరములతో డంగూడ ప్రథమవిద్యకయి 50లక్షల రూప్యము లియ్యఁబడెనను సువార్తయుండెను. హార్డింగు ప్రభువు కూర్చొనిన వెనుక చక్రవర్తి చక్ర వర్తినులకు నాయురారోగ్యైశ్వర్యంబు లగు గాతమని ముమ్మారు సభ వారందఱును ఆశీర్వదించిరి.


సభను ముగింపు చేయుచు శ్రీపంచమజార్జి సార్వభౌ ముఁను అత్యద్భుతముగఁ బ్రజలు దలంపనై న దలంపని, రెండు వరంబుల నిచ్చెను. చిర కాలము ప్రజల మనోవ్యధకుఁ గారణ బయియుండిన వంగ దేశ విభజనము రద్దయిపోయె. భరతవర్షపు రాజధాని కలకత్తానుండి సుప్రసిద్ధమగు ఢిల్లీకి మారువ బడియె. భార తేయుల మనంబులల రె. ఈవరముల గుఱించియు నీదర్బారును గుఱిం చియు నిఁక బెంచి వ్రాయవలసిన పని లేదు. సౌహృదయమున సామ్రాజ్య పరిపాలనకుం గడంగి యుండు మన జార్జి మేరీలకు నాయురారోగ్యైశ్వర్యంబులు పరమాతుండిచ్చి కాపాడు గాక ! ఓం శాంతిః శాంతిః శాంతిః