పుట:Delhi-Darbaru.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ జార్జిపట్టాభి షేకము.

385


కండవ సంవత్సరపు జూను నెల ది 22వ తేదీని సర్వశ క్తుడగు భగవంతుని. కృపాప్రసాదములచే మా రాజపట్టాభిషేక మహోత్సవమును జరుపగలందులకు మారాజచిత్తమును ప్రక టించి వ్యక్తపరచి యుంటిమి గావునను; గడచిన జూను నెల ది22వ తేది గురువారమున సర్వశక్తుడగు భగవంతుని కృపాప్రసాద మువలన, పైని చెప్పిన మహోత్సవమును జరుపగలిగితిమి గావునను, పైని చెప్పిన మహోత్సవ మట్లు జరిగినదని మా హిందూ రాష్ట్రములలోని ప్రేమగల మా ప్రజలకు మేము స్వయ ముగా తెలియ పరచుటయును, మాగవర్నరులను లె ప్టి నెంటు' గవర్నర్లను; మా యితర ఆఫీసర్ల ను, మాసంరక్షణలోనున్న స్వదేశ రాజులను, సంస్థానాధిపతులను, ప్రభువులను, మా హిందూ సామ్రాజ్యపు పరగణా లన్ని టిలోను ఉన్న మాప్రతి నిధులను, మా సన్నిధికి బిలుచుటయును, మా ఆపేక్షయు అభి లాషయునై యున్న వని మేము మా ప్రభుత్వపు ప్రథమ సంవ త్సరమగు క్రీస్తుశకము వేయిన్ని తొమన్నూట పదునొకండవ సనత్సరపు మార్చి నెల ది 22వ తేదిగల మా రాజ ప్రకటనము మూలమున విశదపరచి యుంటిమిగావునను;

ఇప్పుడు మేము మా రాజప్రకటనమగు దీనిమూలమున దానిని విశదపఱచుచు మా ఆఫీసర్లందరికిని, ఢిల్లీలో సమా వేశ మయియున్న రాజులకు సంస్థానాధిపతులకు ప్రజలకు అందరి