పుట:Delhi-Darbaru.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1903 న సంవత్సరపు దర్బారు.

377


టకు నిప్పటికం టే నెక్కువగ సందర్భములున్న చోఁ బరిపాలన మింకను కార్యకారియై యుండును. ఈ యుద్దేశములకై యిప్పుడు 'జాగరూకతతో చేయఁబడుచుండు నేర్పాటులను గుఱించి నేను ప్రస్తావి పను. అవి మీకు త్వరలో తెలుపఁబడి హిత కారియయిన సవ్యవహారాభి వృద్ధికి ప్రధాన లక్షణముగా నుండునని నాకుమిక్కిలి నమ్మకము.

హిదూ దేశ క్షేమము విక్టోరియా రాజిగారి హృదయము నందలి యత్యంత ప్రియవిషయములలో ఒకటి. 1875 వసనత్సరమున దు నేను హిందూ దేశమును సందర్శించిన నాఁట నుండి ఆ దేశము యొక్కయు, అందలి ప్రభువుల యొక్కయు, ప్రజల యొక్కయు యోగ క్షేమములను చిరకాలత్వ కారణ ముచే క్షీణింపని యనురాగముతో కూడిన యుత్సాహము తోడ కనిపట్టి యున్న వాఁడను. నాయనుంగుఁ గొడుక గు వేల్సు ప్రభువుగారును, వేల్సు ప్రభ్విగారును మీతో కొన్ని దినములు నివసించి మీ దేశమునందు అమితానురాగమును, తదీయ 'సౌఖ్య సంత "షములయందు నిజముయిన ఆస క్తి గల శ్రద్ధయును, గలవారయి మరలివచ్చిరి. నా రాజ కుటుంబమునకును వంశ పరంపరకును హిందూ దేశ విషయముననున్న అత్యంతాను భావా పేక్షులుగల యీమనోభావములు ఈ రాజ్యము నందలి ప్రజల యొక్క, గంభీరమయిన యే కాభిప్రాయమును ఉద్దేశమును వాస్తవముగా తెలుపనే తెలుపుచున్న వి.