పుట:Delhi-Darbaru.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

378

దర్బారుల చరిత్రము.


అతి దీర్ఘ కాలము పాలించిన యే రాజ్యము నందుఁగాని సామ్రాజ్యము నందుగాని ప్రభువులకును ప్రజలకును విధింపఁ బడినట్టి మహనీయ 'కార్యమును నెర వేర్చ నావశ్యకములయిన వివేకమును పరస్పర సద్భానమును దై వరక్షణానుగ్రహము లచే వర్దిల్లుగావుత.” 1[1]

శ్రీ జార్జిపట్టాభిషేకము.

గత సంవత్సరము డిసెంబరు మాసము 12 వ తేదీ ఢిల్లీ నగరమున నడచిన మనజార్జి సార్వభౌముని పట్టాభి షేకదర్బారు మహోత్సవము ' భరతవర్షమున జరిగిన ఇట్టి మహూ త్సవము లన్నింటిలో నగ్రస్థానము నందఁదగియున్నది. నాటి దినము మనచరిత్రమున సుదినము. కొంతకాలము పాశ్చాత్య పౌర వాత్య సభ్యత్వములు రెండును మన యీభరత వర్షమున ముఖాముఖియయి చెలంగి భార తీయులగు మనకు నూతనో జ్జీనము మెసం గెను. ఆయుజ్జీవమును బోషించుట మన ప్రభువు లకు ధర్మ మేయయి యుండెను. అయిన వారలలో నుత్తముఁ డగు దాను దన యుదారహృదయమును విప్పి గనుపఱచినం గాని వారి కవసరమగు బలంబు చేకూరదని తలంచి మనజార్జి సార్వభౌముఁడు నూతనపథంబున జాయాసమేతుండు తన సామ్రాజ్యమకుటంబున శిరోరత్నంబగు నీభరతఖండంబునకు

..........................................................................................

I.

  1. Quotation fom Fort St. George.Gazette.