పుట:Delhi-Darbaru.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1903 వ సంవత్సరపు దర్బారు.

375


సంవత్సరపు దర్బారు వఱకును వహించి నదిగాము. అట్టి బిరుదు లేనందున నామె సార్వభౌమత్వమును సంకేతించు సాధనము లేక పోవుచుండుటను గమనించి 'భరతవర్ష చక్రవర్తిని' యను పట్టము నామె ధరించినదని ప్రకటించుట కే దర్బారు ఢిల్లీ యందు జరిగెను. అప్పుడు సర్వసామంతులును ప్రజలును గొం దజు పర దేశ రాజులును సభామంటపము నలంక రించి?. లార్డు లిట్టను ఆమహోత్సవమున విక్టోరియా మహా రాజిగారు “భరతవర్ష చక్రవర్తిని' బిరుదమును వహించిరని ప్రకటించి ఆమె భరతవర్షపు ప్రభువులకును బ్రజలకును నంపిన యను రాగ పూరిత మయిన యుత్తరమును జది వెను.జయజయారావ ములతో దర్బారు ముగింపునం దెను. నాఁటినుండి చక్రవర్తిని గారి ప్రతినిధి స్వదేశ సంస్థానా ధీశ్వరులకంటె నున్న తమగు దర్జా సందెను.

1903 వ సంనత్సరపు దర్బారు.

1903 వ సంవత్సరమున ఢిల్లీయందు సప్తమైడ్వర్డు చక్రవర్తిగారి యనుమతి ననుసరించి లార్డుకర్జను దర్బారు నడ పెను. అతఁడు దానికయి చేసిన వ్యయమును గుఱించి య నే కులు ఖండించుచు వ్రాసియున్నారు. కాని దర్బారు మాత్రము చూపరులకు మిక్కిలి యద్భతముగఁ గన్పించెననుటకు సంది యము లేదు. లార్డు కర్జను గారు ఢిల్లీని జొచ్చినప్పటి ఏనుంగుల