పుట:Delhi-Darbaru.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

374

దర్బారుల చరిత్రము.


మా ప్రజలయినంత వఱకు వారేజాతి వారైనను వారే తెగ వారైనను సామర్థ్యము వలనను సద్వర్తనము వలనను దాము చక్కగా నిర్వహించుట కర్హులయినవారు నూప్రభుత్వములోని పనులకు యథేచ్ఛముగాను నిష్పాక్షికముగాను చేర్చుకొనఁ బడవలయుట మాచి త్త మయియున్నది.

ఈశ్వరానుగ్రహమువలన దేశములో స్వస్థత మరల కలిగింపఁ బడినప్పుడు హిందూ దేశము యొక్క- నెమ్మదియైన కర్మ లను బ్రోత్సాహపఱచుటయు జనోపయు క్తములును వృద్ధికరము లునునైన పనులను పెంపుచెందించుటయు దేశములో నున్న సర్వప్రజల యొక్క లాభముకొఱకు పరిపాలనము జరపుటయు మాయత్యం తాభిలాషయయి యున్నది. మబలము వారి సంపదలోను మా క్షేమము వారితృప్తిలోను మాయుత్తమ ప్రతిఫలము వారి కృతజ్ఞతలోను, ఉండును. సర్వశక్తుఁడయిన ఈ శ్వరుఁడు మాకును మాక్రింద నధికారములో నుండువారికిని మాయీ యభీష్టములను ప్రజల మేలు కొఱకు కొన సాగించు టకు శక్తిని బ్రసాదించునుగాక !1[1]

ఇట్టి యుత్కృష్ట భావములతో భరతవర్ష మును బరి పా లింప మొదలిడిన శ్రీ విక్టోరియా మహా రాజగారు మన దేశము తోడి సంబంధమును దెలుపు బిరుదు నెద్దానిని . గూడ నీ 1877 న

............................................................................................

1,

  1. రావుబహదూరు క. వీళేశలింగము పంతులు గారి విక్టోరియా రాజిచరిత్రము, (84-85 ఫుటలు).