పుట:Delhi-Darbaru.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము.

పూర్వపు దర్బారులు

రాజు లేలు దేశములం దంతటను నొక ఏలికగతించి తరు వాతి ప్రభువు రాజ్యమునకు వచ్చిన మీఁదట నాతని రాజ్య భార నిర్వహణారంభమును సూచించుటకయి యొక వి శేషోత్సనము తప్పక జరుగుచు వచ్చుచున్నది. మానవునకు సంబంధించిన యుత్కృష్ట విషయములన్ని టికినివలె దీనికిని మతవిషయిక భక్తియే సర్వసాధారణముగ మూలాధారమయి కన్పట్టుచున్నది. ఆంగ్లే యభాషయందు ' నీయుత్సవమునకు “ కారొనేషన్' అనఁగా “ కిరీటధారణము' అను నామము ప్రవర్తించుచున్నది. 'పేరుం బట్టిచూడ నిద్దానికి మతవిషయికార్ధ మేమియు నుండునట్లు తోచదు. కాని యచ్చటి ఆచారములను బరిశీలించినచో నచ్చ టను నీయుత్సవమునకు విశేషార్థముగలదని తోఁచకమానదు. అటకిరీటమును రాజు నౌదల నిడుట కేర్పడినవాఁడు మహామతా చార్యుఁడు. ఇతఁడు రాజును రాజిని ప్రజలకుఁ బ్రదర్శించి ' కిరీట' ధారణోత్సవము ను బ్రారంభించును. తరువాత రాజు పైఁ బరమాత్ముని కృపనిలుచుగా తమని ప్రార్థన లొసంగఁ బడును. ఉత్తమమతాచార్యుఁడు రాజునకొక కొంత హితబోధ మొనర్చును.