పుట:Delhi-Darbaru.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొగలాయి వంశము.

13


వంశములో రెండనవాఁడగు సికందరులోడీ ఢిల్లీని వదలి యాగ్రాను రాజధానిగ నేర్పఱుచుకొనియెను. ఇతని కుమారుఁడు సికందరు మిక్కిలి దుర్మార్గుడై నిరంకుశాధికారముతో మెలఁగఁ బ్రారంభిచుట వలన శయమూరు వంశస్థుఁడగు బాబరు హిందూస్థానసామ్రాజ్యరమను గైకొనుట సులభ సాధ్యమయ్యెను. లోడీ బాదుషాహ పానిపత్ కురుక్షేత్రమున నోడింపఁ బడెను. జహిరుద్దీన్ మహమదు. బాబరు బాదుషాహ యయ్యెను.

మొగలాయి వంశము

బాబరు నాలుగుసంవత్సరములు (1526-1531) రాజ్యము చేసి చనిపోయెను.

బాబరు

తదుపరి యతని పుత్రుఁడు హుమాయూను బాదుషాహయై దన రాజధానిని మరల మార్చి యచ్చట నింద్రప్రస్థముండిన ప్రదేశముననే ఒక్క కోటను గట్టించెను. దానినే “పురానాఖిల్లా' (పాతకోట) యందురు. ఇతనిని ఓడించి క్రీ|| శ|| 1540 లో 'కాబూలు' నగరమునకుఁ బారదోలి, షీర్