పుట:Delhi-Darbaru.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

ఢిల్లీ న గ ర చరిత్రము.


మిక్కిలి సౌఖ్యమందిరి. కాని యతనికిఁ దరువాతి రాజులు బలహీనులు నవివేకులు నై నందున లోకప్రసిద్ధుడగు 'తయమూరులంగు ' ఢిల్లీ జొచ్చి యవాచ్యంబగు క్రౌర్యముతో క్రీ. శ. 1398 లోఁ జిన్నలు పెద్దలు, స్త్రీలు పురుషులు, నను వివక్షత లేకుండ నందఱను ఖడ్గమువాతనఱికి, నగరమునందలి ద్రవ్యము నంతయుఁ గొల్ల కొట్టుకొని పోయెను. అతఁడు దీసికొని పోయిన ధనమింత యని లెక్క పెట్టుటకుఁగూడఁ గాదని చరిత్రకారులు వ్రాయుచున్నారు.

తైమూరు లంగ్

ఇతఁడు వెడలి పోయిన రెండు మాసముల వఱకును ఢిల్లీ యరాజకముగనుండెను. ఇక్బాలనువాఁడు గొంత పరిశ్రమచేసి ఢిల్లీ యందలి యల్లకల్లోలమును మాన్చెను. బాదుషానా యగు మహమ్మదీతని మరణానంతరము మరల సింహాసనము నెక్కెను. కాని ఢిల్లీకి బయట నితని శక్తిసాగలేదు. (1412)

ఆఫ్‌గన్ రాజవంశావసానము

ఇతఁడు పరలోక గతుఁడైన తరువాత సయ్యదు వంశమువారు పరిపాలించిరి. వారిని లోడీవంశము మ్రింగివేసెను. ఈ