పుట:Delhi-Darbaru.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

314

మైసూరు రాజ్యము.


ప్రస్తుతో హోయిసణ బలమడం గెను. 1336న సంవత్సరమున విజయనగర సామ్రాజ్యము ప్రారంభమగుటతో హోయిసణ నామమం దులో మునిగిపోయెను.

విజయనగర సామ్రాజ్యము.

దక్ష్మిణ హిందూస్థానమున స్థాపితమయిన ప్రసిద్ధ సామ్రా జ్యములలో విజయనగర సామ్రాజ్యము కడపటి దనుట మా చదువరు లనేకులకుఁ దెలిసిన విషయమే. ఆ సామ్రాజ్యమును గుఱించి విపులములగు గ్రంథములు వాయఁబడి యున్న వి. కావున మాచదువరులకీ విషయము క్రొత్తదిగనుండఁ జాలదు. ఇట వీనిం గూర్చి విరివిగ వ్రాయుటయుఁ బొసఁగదు. ప్రయోగమునకు వలసిన వఱకు సంక్షేపముగ నిచ్చట వ్రాసె దము. విజయనగర సామ్రాజ్య స్థాపకులుగ నెన్నఁబడవలసిన వారు మువ్వురు. చంద్రవంశజులై యాదవసంతతికిఁ జేరిన హక్కఁడు బుక్కఁడు నను ఇరువురన్న దమ్ములును శ్రీశంకరా చార్యులమఠమునకథ్యక్షుఁడుగ నక్కాలముననుండినవిద్యారణ్య బిరుదాంకితుఁడగు మాధవాచార్యులును. హక్క బుక్కలిరువు రునుసంగమునికుమారులు. హక్కఁడు హరిహర రాయలను పేరునవ్యవహరింపఁ బడుచున్నాఁడు. మహమ్మదుతుగ్లకుయొక్క క్రౌర్యము చేఁబుట్టిన అల్లకల్లోల సమయమున స్వదేశీయు లును బహుశః హాయిసణులకు సామంతులుగ నుండినవారును నయిన వీరిరువురును మాధవాచార్యుల సాయము చే తుంగ