పుట:Delhi-Darbaru.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయనగర సామ్రాజ్యము.

315


భద్రాతీరమునఁ బూర్వము గిష్కింధా నగరముండిన ప్రదేశ మునందు విజయనగరమును గట్టుకొని అదివఱకు మహమ్మదీ యుల వశమయి పోయియుండిన ద్వార సముద్రమును, వరంగ ల్లును సాధించి.. మాధవాచార్యులు సాహాయ్యము చేయుటకు ముఖ్య కారణము జైనుల యొక్కయు జంగము వారి యొక్కయు సంఖ్య యభివృద్ధి యగుచుండుటయు మహమ్మదీయ మహా ప్రవాహము గ్రమక్రమముగఁ దమ్ము నావరించు కొన నుంకించు" చుండుటయు నీరెండు విరోధ వాహినులను నెదుర్చుటకుఁ దమ రేదేని యొక ప్రబల సాధనము సంపాదించు కొనవ లెనను ఆశ' వారికిఁ బుట్టుట యేయనియు విల్సను వ్రాయుచున్నాఁడు. ఇది యూహయేయైనను సరియైనయూహ యనియే అంగీకరింప వచ్చును.

విజయనగర సంస్థానా ధీశ్వరుల కులదై వము విరూపా క్షుఁడు. ఈవిరూపాక్షుని పేరిటనే విజయనగ రాధీశ్వరులు దానధర్మాదుల నెనర్చుచుండిరి. హరిహరుఁడు మొదటి రాజు. బుక్కరాయలు రెండవవాఁడు. వీరు దక్షిణ దేశమున కంత టికిని ప్రభువులైరి. కాని 1347 వ సంవత్సరమున బహమని రాజ్యము సం స్థాపింపఁ బడుట వలన వీరు త్తరమున దిగ్విజయము సలుపుటకు వీలు లేక పోయెను. ఇంతియ కాక బహమని సుల్తా నులకును విజయనగర రాజులకును ఎడ తెగని విగ్రహము ప్రారంభమయి లెక్క లేని యుద్ధములు నడచుచుండెను. మొదటి