పుట:Delhi-Darbaru.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312

మైసూరు రాజ్యము.


లపై నెగడఁ జేసెను. 'ప్రస్తుతపు నామముల ననుసరించి ఈ రాజ్యము మైసూరుసీమయు, సేలము, కోయంబుత్తూరు, బళ్లారి, ధార్వాడ జిల్లాలలో నెక్కుడు భాగమును అగు చున్నది. ఇతఁడు సంపూర్ణ స్వాతంత్యమును స్థాపించు కొనెననియే 'చెప్పవచ్చును గాని ఈతని రాజ్యమునందు త్తర భాగమున దొరకిన , శాసనములను బట్టి 1172 వ సంవత్స రము దనుకను హోయిసణులు చాళుక్యులను అధిరాజులుగ నెప్పుకొనుచుండినట్లు విశదపడుచున్నది.

1117న సంవత్సరముబిట్ట దేవుని రాజ్య కాలమున మిక్కిలి ముఖ్యమయినది, అసంవత్సరమున నతఁడు శైవులగు చోళులచే దరుమబడి హోయిసణ రాజ్యముఁ జొచ్చిన శ్రీ రానూనుజా చార్యుల ప్రోత్సాహమువలన వైష్ణవుఁడయి విష్ణువర్ధనుఁడను నామమును ధరించెను. ఇతని కుమారుడు "రాజ్యము సేయునపుడు దేశమంతయును శాంతిమై యు౦డెను. ఆతనిపుత్రుఁడు నరసిం హుఁడు సింహాసనము నధిష్టించినతోడనె యాదవుల పై కరిగి వా రిని జయించి తుంగ భద్రాతీరమందలి దుర్గములను సాధించి పం డ్రెండు సంవత్సరముల కాలము చోళులకు సాధ్యము కాని ఉచ్చం , గియను పాండ్య రాజధానిని లోబఱచుకొని తన రాజ్యమును కృష్ణాతీరమువఱకును వ్యాపింపఁ జేసి వీరబళ్లాళుఁడను పేరువడ సెను. ఈతనివలననే హోయిసణులకు బళ్లాళులనియు నామము కలిగినది. ఇతని కొడుకగు సోమేశ్వరుఁడును యాదవులనోడించె