పుట:Delhi-Darbaru.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయాజి రావు III,

269


ఈ సంస్కారములతో పాటు మాధవరావు బరోడా' సంస్థానమున న్యాయ స్థానములును విద్యాలయములును బుస్తక భాండాగారములును, వైద్య శాలలును మున్నగు జనోపయోగ స్థాపనలను నెలకొల్పి పనికిమాలిన చిల్లరపన్ను లను రద్దుపఱచి బరోడా ' నగరమునందలి అనారోగ్యమయిన సందుగొందుల నిర్మూలము చేసి అట ప్రభుత్వమువారీ ద్రవ్యముతో బీదలకిండ్లు. గట్టించి యిచ్చి ప్రజారంజకుఁడయి వెలిగెను. ఆర్థిక దుర్దశ లోమునింగి యల్లకల్లోలముల పాలయి నశింపనున్న బరోడా' సంస్థానము - ఈతని రాక వలన ముందురాఁగల దుర్భిక్షాదుల నివారించుటకయి ఒకటిన్నర కోటి రూపాయిలు తన బొక్క సమున నిడుకొని కలకలలాడుచు సక్రమమగు రాజ్యాంగ పద్ధతిలో సంశోభిల్లఁ గలిగెను. ఇట్టి పుత్రులు భారతమాతగర్భమున నప్పు డప్పుడయినను జనించుచుండుట వలనఁగదా భారతీయుల కింకను గొంచెము గౌరవ మున్నది? ఇట్టివారి సంఖ్య క్రమక్రమముగ హెచ్చినం గదా మన కెప్పటి కైనను మోక్షము కలుగఁ గలదు? హేచ్చుచున్నదనుటకు మాధవరావుగారి శిష్యుండగు సయా జీరావే తార్కాణము.

ఇతఁడు. 1881 వ సంవత్సరము డిశంబరు నెల 28 వ తేది లార్డు రిపన్ ప్రభువు 'కాలమున సుపూర్ణ స్వాతంత్ర్యములతో బరోడా సంస్థానమును బాలింప నియోగింపఁబడెను. ఇతని విద్యాభ్యాస విషయమునందు ప్రసిద్ధుఁడయిన ఎలియట్ దొర