పుట:Delhi-Darbaru.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

193

సాలార్జంగు ప్రవర్తన.


కార్యదర్శిగనుండిన సాలిన్ బరి ప్రభువు మిక్కిలి చాతుర్య ముగను దృఢముగను నైజాముగారు బాలుఁడుగనున్నంత కాలము ఆసంస్థానపు రాజకీయ సంబంధములు మార్చుటకు వీలు లేదనియు 1858, 1860లలో జరిగిన సంధుల ఔచిత్యా నౌచిత్యముల చర్చించుట తగదనియుఁ బ్రత్యుత్తరమిచ్చిరి.


" అయిన ఇంగ్లాండునకుఁ బోవుటకుఁ బూర్వమే ఆమంత్రి, అనఁగాసర్ సాలారు, ఆంగ్లేయ పత్రికల మూలమున దన మొర్రలు ప్రారంభింపించెను !*[1] ( అదివరకే బీరారును గుఱించి యితఁడు రెండవ మారు అర్జీ యిచ్చుకొనియున్నందున 1877 వ సంవత్సరమున జరుగనున్న చక్రవర్తిని దర్బారునకు ఆంగ్లేయ ప్రభుత్వము వారిసార్వభౌమత్వమును ఒప్పుకొనిననే తప్ప ఇతఁడు రాకూడ దని తెలుపఁ బడెను. ఆదర్బారున కభిముఖుఁడయి ఇతఁడట్టి 'సార్వభౌమత్వాంగీకార మెంత యవసరమయినదియు ఎంత యనివార్యమయినదియు ప్రకటించెను. అచిర కాలములోనే సాలిస్ బరి ప్రభువుగారు దన అర్జీ పైని చేసిన తీర్మానములను సంపూర్ణముగ నంగీకరించెను..... ...............................................................................................

  • ఇచ్చట నీ చరిత్రకారుఁడు ఆంగ్లేయ పత్రికలు బహుతీవ్రముగ వ్రా సినవని నుడువుచు ఆతీవ్రతకు సర్ సాలారు' ఉత్తరవాది గాడను చున్నాఁడు.