పుట:Delhi-Darbaru.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాలారుజంగు పై కుట్రలు,

185



దువ యుంచఁబడియుండిన నగలన్నియును విడిపింపఁబడెను. ఇట్టి పరిపాలనా ఫలములు దృష్టి గోచరములగుచుండ భరత ఖండము గొప్ప పరిపాలకులను ఉత్తమరాజనీతి విదులను నీన జాలదని యెవ్వండనసాహసింపగలఁడు? (భారతపుత్రులకు) వలసినది (తమశక్తులఁ బ్రదర్శింపుటకు) అవకాశముమాత్రమే” యని సర్ సాలారుజంగును గుఱించి వ్రాయుచు ఒక చరిత్ర కారుఁడు లిఖంచుచున్నాఁడు.1[1]

సాలారుజంగు పై కుట్రలు.

సమర్థతగలవానికి విరోధములు పుట్టుట సహజము. సర్ సాలారుజంగునకును నైజామునకును గలహము పెట్టి ఏవిధ మున నైనను సర్ సాలారును బదభ్రష్టుని జేయించవలెనని స్వలాభాపేక్షుకులయిన కొందఱు అవినీతులు కుట్రలఁబన్నిరి. సర్ సాలారు నెడ రెసి డెంటున కప్రియము గావున నతనిని దీసి వేయవ లెనని నైజామునకును నైజామునక ప్రియుఁడు గావున అతఁడు దీసి వేయఁబడ నున్నా డని రెసిడెంటునకును ఒకరివిష యము మఱొక్కడికి దెలియకుండు పగిది కుట్రకారులు కార్య ములు నడిపిరి. కాని ఆకుట్రలు నిలిచినవు కావు. రెసిడెంటునకును నైజామునకును ఇరువురకును సర్ సాలారుజంగనిన మహాదరము. అందునలన . నిరువురును ముఖాముఖిఁ 'దర్కించుకొనుటయు సత్యము బయల్ప డెను. ఇట్టితరుణములు 1861లో నొకటియు

...................................................................................

I.

  1. J. D. B. Gribble.