పుట:Delhi-Darbaru.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

హైదరాబాదు సంస్థానము


. "నిచ్చి వైచి తఱుమవలసినదని యుత్తరువాయెను. అయిన నీయుత్త రువులు మొదట మొదట బహుస్వల్పముగ చెల్లించఁబడెననినచో నొకయాశ్చర్యముగాదు. సర్ సాలార్ జంగు మఱి యొక ఏర్పా టునుగూడఁ జేసెను. అరబ్బీలకును రాజ్యములోని యితరప్రజ లకునుగల లావా దేవీ లెక్కలను జనులకు నన్యాయము జరుగ కుండఁ దీర్చుటకుఁ దన నగరునం దే యొక క్రొత్త న్యాయస్థానము నేర్పఱచెను. ఈ న్యాయస్థానము ఆరంభమునుండియు మిక్కిలి యుపయోగకారి యయ్యెను. దీనివలన నియ్యఁబడిన తీర్పు లన్ని యు నక్కాలమున ప్రముఖులుగా నుండిన ఇద్దజు జమేదా రులున్యాయమని యొప్పుకొనుచు వచ్చిరి. దుర్మార్గులయి తిరుగఁ బడిన ఆరబ్బీలను బందీకరించుటకు (arresting) ఈజమేదారు ముఖ్యమంత్రిగా రధికార మిచ్చిరి. అట్లు బందీకరించుటలో నవసరమని తోఁచినయెడల నీ జమేదారు లెంతటి పనియైనను జేయవచ్చునని యాజ్ఞ. కావున వారు సర్ సాలారుజంగునకుఁ జేసిన సాయము అంతింతయని చెప్పనవసరము లేదు. ఇట్లు అరబ్బీ లపై సర్వాధికారులగు జమేదారులను దోడు చేసికొని సర్ సా లారుజంగు అదివరకు అరబ్బీల చేతులలోనికిఁ బోయియుండిన జమానులను మెల్ల మెల్లఁగ రాఁబట్ట మొదలిడెను. ఇందుఁ గొన్ని వేరు వేరు వ్యక్తులవలన కుదువ పెట్టఁబడినవి. మఱికొన్ని సర్ సాలారునకుఁ బూర్వముండిన మంత్రులచే అరబ్బీలకు సర్కారు రియ్యవలసియుండిన అప్పుల కై యిచ్చి వేయఁబడినవి. వీనిని