పుట:Delhi-Darbaru.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఫ్ జుల్ - ఉద్ - దౌలా.

175


మరల సంపాదించుటకై సర్ సాలారుజం గుపయోగించిన పద్ధ తిలో నేమాత్రము న్యాయవిరోధము లేదు. ఆతఁడు సర్కారు బొక్క సమునుండి యియ్యఁగలిగి నంత పైకమును అరబ్బీల బాకీల కిచ్చి వేయుచు నిలువయుండిన మొత్తములకు సాహు కారులనుజూమీను.ఇచ్చుచువచ్చెను. ఈసంస్కారముల నుపక్ర మించుటలో సర్ సాలారుజంగు పడిన కష్టములపరిమితి నిట వర్ణిం చుట అనవసరము, అయిన నితనియోరుపువల్లను కార్యసాధనా శక్తినలనను అవన్ని'యును సూర్యునియెదుట నంధ కారములు వలె నదృశ్యములాయెను. 1856 న సంవ్సరమున నతఁడు. హైద రాబాదు సంస్థానమునందు జరుగుచుండిన బానిసవ్యాపార మును చట్టము చే నిలిపి వేసెను.

ఆఫ్ జుల్ - ఉద్ - దౌలా (1857-1869).

పైనిఁ బేర్కొనిన సంస్కారములు గాక సర్ సాలారు అంతఃపరిపాలనయం దింకను విశేషమగు గొప్ప మార్పులు చేయవలసిన వాఁడై ఆ ప్రయత్నములయం దుద్యు క్తుఁడయి యుండెను. ఇట్లుండ 1857 వ సంవత్సరపు మహావిష్ణ వము తటస్థించెను. ఉత్తర హిందూస్థాన మంతయును ఆవిప్లవ దవానలంబునం బడి. మండుచుండెను. దాని యుష్ణము దక్షిణమునకు బ్రాకి హైదరాబాదును నావరించుకొని నైజామునుగూడఁ దనపక్షమునఁ జేర్చుకొనినచో నంతయుఁ బోయిన దనుకొనవలసిన దేయని హైదరా బాదునందు రెసిడెం