పుట:Delhi-Darbaru.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంగ్లేయులతో సంధి. (1800).

141


ము సమ్మతించెను. ఈసంధివలన నైజామును ఆంగ్లేయులును రాజు కీయ కార్యముల కై క్యతనొందుట నిర్వచింపఁ బడినందున నైజా ము పరరాష్ట్రములతో నాంగ్లేయులకుఁ దెలియకుండ నుత్తర ప్రత్యుత్తరములు సలుపుట లేదనియుఁ, బర రాష్ట్రము వారిలో బోరునకు దాను పోవుట లేదనియు, ఒక వేళఁ బర రాష్ట్రపు వారితోఁ దనకు వివాదములు గలిగినప్పు డాంగ్లేయ వర్తక సంఘము వారు న్యాయము విచారించి తీర్మానము చేసిన విధమున నడచుకొను ననియును కూడ యొడంబడిక చేసికోనెను. ఆంగ్లే య నర్తక సంఘమువాగు నైజాము పై నకారణముగ దండె త్తివచ్చు శత్రువుల నణచుభారము నంగీకరించుటయే గాక నై జామునకు సర్వవిధముల సాయపడఁదలంచికొని యుండుటను సూచించిరి.“ నిజమునకు (నైజామును ఆంగ్లేయ సంఘము వారును) ఒక్క టేయయి యైక్యమయినందున" ననుపదములు ఈసంధి పత్రమున భూమిక (Preamble) యందును షరతుల యందును గూడఁ 'గాననచ్చుట వలన నైజాము గొంచెము లోతుగఁ బరిశీలించిన పూర్ణాశ్రయతను 'బయల్పఱచునట్టి ఆత్మ గౌణసామ్యమును(Self subordinating equality)దప్పక వచ్చి సందువలన నాంగ్లేయుల యెడ నంగీక రించెనని చెప్పవచ్చును అని యొక చరిత్రకారుఁడు వ్రాయుచున్నాఁడు 1 [1]ఇప్పగిది రాజ కీయ విషయములలో నైజాముతో దిట్టమగు నేర్పాటులు గా

I

  1. Mac-auliffe-The Nizam.