పుట:Delhi-Darbaru.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

హైదరాబాదు సంస్థానము


వించుకొని యాంగ్లేయులు 1802 వ సంవత్సరమున నతనితో వర్తక సంధి ఒక్కటిని గుదుర్చుకొనిరి. దానివలన వర్తకులకు మున్నుండిన గష్టము లనేకములు దీరిపోయెను. ఒకరి రాష్ట్ర మునుండి మఱియొకరి. రాష్ట్రమునకు దిగునుతి కాఁగల సరకుల పై నూటి కైదువంతున సుంకముగట్టుట నిర్ణయింపఁబడెను. కొన్ని మార్పులతో ఆ పద్ధతియే నేటికిని సాగుచున్న ది.

నైజామలీ చివరదినములు.

తనతదనంతరము దన రాజ్యమును నైజామలీ కుమా రులు మువ్వురకునుఁ బంచి పెట్టవ లెనను ఉద్దేశము దనకుఁగలదని కనుపఱచి దాని కై మహారాష్ట్రులయు నాంగ్లేయులయు సమ్మతిఁ బడయనుండెను. ఇట ఢిల్లీ చక్రవర్తిగారి యనుమతిమాటయే దలపట్టకుంట మనము గమనింపవలెను. ఈలోపుగ 1797 న సంవత్సరమున నైజామలీ మిక్కిలి జబ్బుపడెను. అప్పుడాతని పెద్దకుమారుఁడు గొంతకస్టముమీఁదఁ దండ్రికిఁ బ్రతినిధిగ రాజకీయ కార్యములు నెరవేర్ప నేమింఁబడెను. 1799 లో నైజామునకు వ్యాధి ప్రబలి మృత్యువును దెచ్చి పెట్టు నేమో యను స్థితినిగలిగించెను. ఆతరుణమున గవర్నరుజనరలుగారు రెసి డెంటునకొక యుత్తరము వ్రాసిరి. అందులో నాంగ్లేయులు సికందరుజాకు నైజూమలీ మరణానంతరము సాయము చేయ వలసినచో నతఁడీయకొనవలసిన షరతులు లిఖింపఁబడెను. నానికన్నిటికిని అతఁడొప్పుకొనెను. నైజామలీ కుత్తుక నుండి