పుట:Delhi-Darbaru.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పట్టాభిషేక మహోత్సవము.

97


రెండవనాఁడర్ధ రాత్రమున నామహామహుఁడు పరలోక జెందెను. రాజ్యాంగ కార్యములు చక్రవర్తి కొఱకై నను నిలువఁ జాలవుగదా! తండ్రి మరణమందిన కొన్ని గంటలలోపు గనే జాగ్జి రాకొమరుఁడు రాజును చక్రవర్తి యునయి యాలో చన సభాభవనమునకు స్వారి వెడలవలసిన వాఁడాయెను. యధా విధిగ నెడ్వర్డు చక్రవర్తి కుత్తరక్రియలు జరిగెను. సంవత్సర కాలము శోకచిహ్నములతో సర్వ కార్యములును నడుపఁ బడెను. 1911 వ సంవత్సరము జూన్ నెల 22వ తేది ఇంగ్లాండున పంచమజార్జి చక్రవర్తికిని మేరీ చక్రవర్తినికిని పట్టాభి షేక మహోత్సవము జరిగెను. అదే సంవత్సరము వీరిరువురును డిశెంబరు మాసమున భరతవర్షమునకుఁ దరలి వచ్చి భారతీ యుల నెల్ల సంతోషాంబుధి నోలలాడఁ జేయుచు ప్రాచీన చక్ర వర్తులంబలే పురాణ ప్రసిద్ధంబగు ఢిల్లీ నగరమున సామ్రాజ్య పట్టభద్రులయిరి. ఆమహోత్సవమును ముందు దర్బారుల విషయమయి వ్రాయు ప్రకరణములో వర్ణింతుము. ఆ సమ యమున విచ్చేసిన కొందఱు సామంత రాజులను గుఱించియు వారి రాజ్యములను గుఱించియు రాఁబోవు ప్రకరణములలో దెల్పెదము.