పుట:Delhi-Darbaru.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

శ్రీ రా జ ద ం ప తు లు.



మన సామ్రాజ్య స్థాపన చరిత్రమున నెక్కుడు సంబంధము గలది.*[1] అచ్చటినుండి దక్షిణ ఇండియా యందలి యుష్ణ భూములను దాఁటి యుత్తరాభిముఖులమయి పవిత్ర క్షేత్రమయి హిందూ మతమునకు రాజధాని యనఁదగి పుణ్యనదికిని ప్రసిద్ధ దేవాలయ ములకును నావాసమయిన వారణాసింగడచి మరల కటికచలికిని మంచునకును బుట్టి నిల్లయిన క్వెట్టా ప్రదేశమును జొచ్చితిమి. దానిని వదలి బోలను కనుమ ద్వారా నత్యద్భుతమగు రైలుమార్గ మున సముద్రతీరమునకు 5500 అడుగుల పైనుండి దిగి సింధు మండలములోని తీక్షాతపమున కాకరమగు మైదానములను దరించి కరాచీ రేవు చేరితిమి” అని జార్జి రాకొమరుఁడు ఇంగ్లాండు చేరిన తరువాత గిల్లుహాలుభ వనమున నుడివెను.

ఇతని వాక్యములన్ని యు మనము సంతోషముతో జ్ఞాపకముంచుకొనఁ దగిన వే. అందులోఁ గ్రిందగీతలు వేయఁ బడిన భాగము మనచక్రవర్తిగారి హృదయస్థ ప్రేమను వెల్ల డించుచున్నది గావున నది మనకు సర్వకాలముల యం దును స్మరణీయము. “నేను జూచిన విషయములను బట్టి యు వినిన సంగతులను బట్టియు మనము రాజ్య కార్యనిర్వ హణమున జనులయెడ నెక్కుడు సానుభూతిగనుపుపఁ గడం గినచో" యను పదములు జార్జి ప్రభువుగారు భారత వర్షమును ......................................................................................................

యని చక్రవర్తి గారిభావము .

  1. తూర్పుతీరమున నాంగ్లేయుల మొదటి స్థానములలో నిది యొకటి.