పుట:Delhi-Darbaru.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పత్రికా ప్రతినిధికి దర్శన మొసంగుట.

93


గుజించి యెన్ని యో విషయముల నెఱింగికొని యుండిరనుట విశదపఱుచుచున్నవి.

పత్రికా ప్రతినిధికి దర్శన మొసంగుట.

మన దేశము నందలి పత్రికలలో నెల్ల పత్రిక యని పేరుఁ గాంచిన అమృత బజారు పత్రికను మన ప్రభువు విడువక చదువుచుండెడి వాఁడఁట. నిర్భయముగ నధికారుల లోప ములను ఖండించుటకుఁ బ్రసిద్ధిచెందిన యీపత్రికను జదువు చుండుటయే కాక, తాను కలకత్తాకుఁబోయి యుండిన సమయ మున నీపత్రికా ప్రతినిధికి దర్శనమిచ్చి యతనితో సంభాషిం చెను. ఎప్పుడును నధికారుల వలన సందేహము చేఁ జూడఁబడుచు కఁబడుచు వచ్చిన యి" ప్రతినిధిగారికి యువ రాజుగారు దయలో స్వాగత మిచ్చినపు డతని మనస్సు కరగి కన్ను లనుండి జారఁదొడంగెనో నాఁగసంతో పాత్రు లుబుక పొర లెను. కృతజ్ఞతావాక్యము లొక్క. టి ఒక్కటి యొరసికొని రాఁ బ్రయత్నించి కంఠమున బెనఁగుచుండెనో యన నాతని స్వనము కంపమందెను. ఇట్టి సందర్భముల నతఁడు జార్జి రాకొమరునితో “ప్రభువుగవా ! చిత్తగింపుము. క్షుద్రుఁడనైన నాకుఁ దమ యీదర్శనమువలన మహాగౌరవ మలవడినది. ఇద్దానిని నేనెల్లప్పుడును గృతజ్ఞత జ్ఞాపకముంచుకొనియెదను. భవిష్యత్తున మాకు చక్రవర్తి కాంగల తమ యెదుట నున్నాడను గాన , భరతవర్షము దుస్థితి యందున్నదని చెప్ప సెలవు వేడు చున్నాఁడను. తమరు మున్ను