పుట:Delhi-Darbaru.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జార్జియువ రాజ ప ద వి.

81


కొమరుఁడును రాకొమరైయు నను బిరుదులందిరి. ఈ బిరుదు లంచుటయె సింహాసనమునకుఁ దామ యప్పటి రాజ్యారూడు లకుఁ బిమ్మట హక్కు దారులని స్థాపించుకొనుట. కావున నె యీ బిరుదులనందు రాబిడ్డలకు దేశీయులందరు హర్షముతో సభివాదన మొనరింతురు. లండనునగర పౌరులు జార్జి మేరీల కిట్టి యభివాదనోత్సవము జరపినపుడు ఆంగ్లేయులారా, మేలుకొనుఁడి " అను శీర్షికతో జార్జి ప్రభువిచ్చిన యుపన్యాస మిప్పటికీని సుప్రసిద్ధమై యున్నది. నాఁటినుండి వేల్సు రా కొమరుఁడు దండ్రికిఁ క్రమ క్రమముగ నెక్కుడు సహ కారికాఁ జొచ్చెను. 1902 న సంవత్సరము వసంత కాలమం తయు రానున్న పట్టాభిషేక మహోత్సనమును గుఱించి జనులుత్సుకులయి యుండిరి. లగ్నమునకుఁ గొన్ని గంటల పూర్వ మెడ్వర్డు చక్రనర్తి యస్వస్థత నందెననియు రణచికిత్స యవసర మయ్యెననియు దుర్వార్త ప్రపంచము నావరిం చెను. ఉత్సవమునకు సర్వసిద్ధముగ నుండిన లండను ప్రజ దీనివలన నెట్లు మ్రాన్పడినదియు నాఁటనుండిన వారేరును మఱవఁ జాలరు. దిగ్భ్రమ వాసిన తోడనె యానగరమునఁ జేయఁబడి యున్న ఏర్పాటు లెల్లయు మెక్క తృటి కాలమున నాపి వేయఁ బడెను. బ్రిటిషు ప్రజలును, నెడ్వర్డు చక్రవర్తి శాంతగుణము నెఱింగియున్న యితర దేశీయులును దుఃఖమున మునిఁగి పోయిరి. ఇట్లయ్యును నాతని వి శేషానుజ్ఞల ననుసరించి కొన్ని కొన్ని