పుట:Delhi-Darbaru.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

శ్రీరాజ దంపతులు


.

డును సామాన్య జన స్వాతంత్ర్య సుస్థాపకుఁడును అగు మంత్రి సత్తముఁడు దివికేగిన తరువాత నెంతో కాల మాయుత్తమ మిత్రుని సాంగత్యము వీడ లేక వెడ లెనో యన విక్టోరియా మహారాణి 'యచిరకాలములోనే 1901 సంవత్సరమున దన సుప్రసిద్ధ శాంతపరిపాలనమును వదలి దిగంతంబులకు వ్యాపిం చియుండిన కీర్తి పుజంబులనలనఁ బొమరులగు సర్వజనుల హృదయ సీమలనుండి "వెల్వడు దుఃఖ పరంపరల నురుమారుచు వారి శుద్ధప్రేమానిలంబుల సర్వవ్యాపనముతో నాలింగింప స్థూలకాయంబు వదలి ప్రకృతితో సమ్మేళన మందెను.

జార్జియు న రా జ ప ద వి.

ఈమె మరణమువలన వేల్సు ప్రభువు సప్త మైడ్వర్డు చక్రని యయ్యెను. మార్కు ప్రభువు కారన్ వాల్ ప్రభువై తండ్రియనుమతిమీఁద మార్చి 16 న తేది భార్యతోఁ గూడ ఆస్ట్ర లేసియాఁ జూచి రాఁబయలు దేరెను. అచ్చటతఁడు తద్దే శపుఁ బ్రథమ పార్లమెంటు సభ ననఁగా రాజకీయ సభను డెఱ చెను. ప్రభ్వీ ప్రభువుల యీభ్రమణ కాలమువలన ఆస్ట్ర లేసియా న్యూజీలాండు, దక్షిణ ఆఫ్రికా, కనడా, దేశములయందలి బ్రిటి షు ప్రజలకు సంతోష ప్రేమలు గలిగెను. నవంబరు మాసము మొదటిదినమున జార్జి ప్రభువును మేరీ ప్రభ్వియు నింగ్లాండు వచ్చి చేరిరి. ఎనిమిది దినములకుఁ దరువాత నెడ్వర్డు మహా రాజు పుట్టిన దినమున, కారన్ వాల్ ప్రభువును ప్రభ్వియు "వేల్సురా