పుట:Contributing to Wikipedia brochure draft version 7.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వికీపీడియా పదావ‌ళి

ఉచిత లైసెన్స్

వికీపీడియాలోని విషయాలను ఎవరైనా, ఎటువంటి లక్ష్యానికైనా వాడుకోవడానికి, అధ్యయనం, నకలు, నకళ్లు పంపిణీ చేయడానికి, సవరణలు, అభివృద్ధి చేయడానికి, అటువంటి తద్భవాలను పంపిణీ చేయడానికి, అలాగే బొమ్మలు, ఇతర విషయాలను ఏవైనా ఎక్కడైనా ఉచితంగా వాడుకోవడానికి, మార్పులు, అభివృద్ధిచేయడానకి, ప్రచురించి ప్రతులను పంచిపెట్టడానికి అనుమతి ఇవ్వడమేగాక వాటిని ఏలాంటి ఉపయోగానికైనా ఎవరితోనైనా పంచుకోవడానికి అనుమతించే నకలు హక్కుల లైసెన్స్. వికీపీడియా మరియు దానిలోని ప్రతి కృషి " క్రియేటివ్ కామన్స్ ఆట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్స్ 3.0 " అనే ఉచిత లైసెన్స్ కు కట్టుబడి జరుగుతుంది. | మరింత సమాచారానికి దగ్గరి దారి WP:CC-BY-SA

చరిత్ర

ఇక్కడ సభ్యులు చేసిన మార్పుల వివరాల జాబితా ఉంటుంది. వికీపీడియా వ్యాస మార్పుల నమోదు పేజీ చరిత్రను చూడండి అనే బటన్ ద్వారా చేరవచ్చు. లంకెలను చూడవచ్చు. దానిలో (ప్రస్తుత - గత) బటన్ లను నొక్కడం ద్వారా ఏ రెండు రూపాల మధ్య తేడాలను చూడవచ్చు. పాత రూపాలను తిరిగి ప్రదర్శితమయ్యే రూపంగా చేయవచ్చు.

చర్చాపేజీ

ఒక వ్యాసానికి లేక ఇతర వికీపీడియా పేజీల చర్చలకు కేటాయించిన స్థలం. మీరు ఇతర సభ్యులతో సంబంధిత పేజీలో విషయం గురించి చర్చించవచ్చు.

పరామితి

ఒక పైపు చిహ్నం (|) ఉపయోగించి పదబంధాలను వేరు చేసేది. దీని ద్వారా బొమ్మలు, మూసలు మరియు ఇతర వికీ మార్కప్, వ్యాస పేజీలో ప్రదర్శితమవటాన్ని నిర్దేశించవచ్చు.

మార్కప్(చిహ్నాలు)

వికీపీడియా పుటను తయారుచేయడానికి ఉపయోగించే ప్రత్యేక సాంకేతిక చిహ్నాలు. ప్రాథమికాంశాలకు మార్కప్ మార్గదర్శిక (పేజి 15) లేక మరిన్ని వివరాలకు| దగ్గరిదారి H:MARKUP

మూస

ఒకపేజీలో ఉన్న విషయాన్ని మరొకపేజీలో చేర్చడానికి సులభమైన పద్ధతి. ఒకే తరహా విషయ వివరణలను పలుపేజీలలో చేర్చవలసిన అవసరం ఏర్పడినప్పుడు మూసలను తయారు చేసి వాటిని వాడుతూ ఉంటారు. వాడుటకు సూచనల కొరకు , చూడండి| దగ్గరి దారి H:T

మొలక

విస్తరణకు బాగా అవకాశమున్న చిన్న వ్యాసం. కొత్త సభ్యులు వికీపీడియాలో రచనలు చేయడం ప్రారంభించేటప్పుడు మొలకలను విస్తరించడం చాలా మంచి పని.

వాడుకరి పేజీ

ఇది వికీపీడియా సభ్యునికి వ్యక్తిగత పేజీ. ఇది వాడుకరి: అనే పదంతో ప్రారంభమయి తరువాత వాడుకరి పేరుని కలిగి వుంటుంది. వికీపీడియా సభ్యులు తమ వివరాలు, ఆసక్తులను అవసరమని భావించినంతవరకు చేర్చవచ్చు. పనిచేసిన లేక చేయబోయే వ్యాసాలు, ఇతర వివరాలు చేర్చవచ్చు.

వికీకామన్స్

వికీపీడియా, దాని అనుబంధ ప్రాజెక్టుల లో విషయాన్ని వివరించడానికి అవసరమైన ఛాయాచిత్రాలను, వీడియోలను మరియు ఇతర ఫైళ్లను మీరు స్వేచ్ఛా నకలు హక్కుల అనుమతితో భద్రపరిచగల భాండాగారం.

వికీపీడియన్

వికీపీడియా అభివృద్ధికి కృషి చేసే వ్యక్తి. సామాన్య పర్యాయపదాలు: సంపాదకుడు, వాడుకరి, రచయిత, సముదాయ సభ్యుడు

సమాచారపెట్టె

విషయాన్ని గురించిన ముఖ్య మైన సమాచారంతో తరచు వ్యాసం మొదటి భాగంలో వాడే పెట్టె. మూసలకు సామాన్య రూపమే సమాచార పెట్టెలు.

సారాంశం (సవరణ)

వికీపీడియా వ్యాసంలో మార్పు గురించిన వివరణ, ఇతర వాడుకరులు, వ్యాస సవరణల క్రమమును గమనించడానికి వీలుగా సవరణ ఉద్దేశ్యాన్ని తెలుపుతుంది.

గుర్తింపులు
  • ఆంగ్ల మూల పాఠ్యం: Sage Ross(WMF)
  • ఆంగ్ల రూపలావణ్యం:<TBD>
  • తెలుగుసేత:టి.సుజాత,అహ్మద్ నిసార్, రహ్మనుద్దీన్, అర్జున తదితరులు
  • తెలుగు వికీపీడియా సంచికకు మార్పులు, సంపాదకత్వం: అర్జున
  • సహకారం:తెలుగు వికీపీడియా మరియు వికీసోర్స్ సభ్యులు

వికీమీడియా భారతదేశం చాప్టర్ ( నమోదు చేయబడిన పేరు వికీమీడియా చాప్టర్) ఒక స్వలాభాపేక్ష లేని సంస్థ. సంఘం కార్యాలయం, బెంగుళూరు పట్టణ జిల్లా వద్ద 3 జనవరి 2011 రిజిస్టర్ చెయ్యబడింది. భారతీయులకు స్వేచ్ఛా విజ్ఞానాన్ని అందుబాటులో ఉంచడం, అటువంటి సాధనాలకు తోడ్పాడటానికి, ప్రజల నైపుణ్యాలను మెరుగు పరచేలా చేయడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. ఇది వికీపీడియా మరి ఇతర ప్రాజెక్టులు నడిపే వికీమీడియా ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తున్నది. వికీమీడియా చాప్టర్ కు వికీపీడియా, ఇతర ప్రాజెక్టులలో చేర్చే విషయాలపై ఏ విధమైన నియంత్రణ లేదు. అలాగే ఈ ప్రాజెక్టులను నడిపే సర్వర్లపై నేరు ఆధిపత్యం లేదు.

వికీమీడియా ఫౌండేషన్ 149 న్యూ మోంట్గోమరీ స్ట్రీట్, థర్డ్ ఫ్లోర్ శాన్ ఫ్రాన్సిస్కో, సిఎ 94105, యుఎస్ఎ. వికీమీడియా ఫౌండేషన్ ఒక లాభాపేక్ష లేని సంస్థ. ఇది వికీపీడియా, ఇతర ఉచిత విషయాలు గల వెబ్సైట్లను నడుపుతుంది.

వేరేగా పేర్కొనకబోతే అన్ని బొమ్మలు వికీమీడియాకామన్స్ నుండి సిసి-బై-ఎస్ఎ (CC-BY-SA) లేక ఇతర సార్వజనీయమైన లైసెన్సులతో విడుదల చేయబడినవి. పాఠ్యము క్రియేటివ్ కామన్స్ యాట్రిబ్యూషన్-షేర్ ఎలైక్ లైసెన్స్ v.3.0 లేక దాని తరువాత రూపంతో(Creative Commons Attribution-ShareAlike License v.3.0) లింకు విడుదలచెయ్యబడింది.

వికీమీడియా ఫౌండేషన్, ఇతర సంస్థల వ్యాపార చిహ్నాలు మరియు గుర్తులు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కు లోబడవు. వికీమీడియా ఫౌండేషన్, వికీపీడియా, కామన్స్, మీడియావికీ, విక్షనరీ, వికీబుక్స్, వికీసోర్స్, వికీన్యూస్, వికీఖోట్, వికీవర్శిటీ, వికీస్పిసీస్, మెటా వికీలు నమోదు చేయబడిన లేక నమోదు చేయబడుతున్న వ్యాపార చిహ్నాలు.

మరింత సమాచారానికి, మా వ్యాపార చిహ్నల విధానం లింకు చూడండి: ఇతర ప్రశ్నలకు మరియు లైసెన్స్ షరతులకు లేక వ్యాపార చిహ్నాల విధానానికి వికీమీడియా ఫౌండేషన్ న్యాయశాఖకు ఈమెయిల్ (legal@wikimedia.org) చేయండి. వికీమీడియా భారతదేశం గురించి, ఈ తెలుగు పుస్తకం గురించి సూచనలు చేయదలిస్తే వికీమీడియా భారతదేశానికి ఈ మెయిల్ (chapter@wikimedia.in) చేయండి.