పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17

మహాత్ముడు

మన మహాత్ముడు విజయవాడలో పూరించిన పాంచజన్యమును, నేను మొదట విన్నప్పటినుండి నాలో కల్గిన మార్పులను క్లుప్తముగ వ్రాయుచున్నాను.

నాకప్పడు నడివయసు. గుంటూరుజిల్లా నా జన్మభూమి అగుటచేత తిండికి ఘనుడుగ నుండెడివాడను. నాచేత డబ్బు మెండుగ మెదలుచుండెను. నగర నివాసమగుటచేత కోరికలకును హద్దు లేకుండెను. తెల్లవారగనే చిక్కనికాఫీతో కూడ రెండురకముల ఫలహారములను, మధ్యాహ్నమున మంచిభోజనమును, పిమ్మట మూడు గంటలకు ఒక కారము, ఒక తీపి, కాఫీ పుచ్చుకొనుచుంటిని. సాయంసమయమున పికారుకు వెళ్లి సుగుణవిలాస సభలోను, మద్రాసు యునైటెడ్ క్లబ్బులోను స్నేహితులతో కూడ యిష్టాగోష్టి సలుపుచు అక్కడి అల్పాహారములను ఆరగించుచుంటిని. పికారుకు పోయి యింటికి వచ్చునపుడు దోవలో బొంబాయి మిఠాయిూలను, గుజరాతి లడ్డులను, మార్వాడి గరిమసాల పకోడీలను తెచ్చుకొని తినుచుంటిని. ఇవి అన్నియు జాలక ఇంటిలో నేతితో గారెలను చేయించుకొనుచుంటిని. ప్రతి శుక్రవారము ఇంటిలో అమ్మణ్ణికి మధుర పదార్ధములు నివేదన జరుగుచుండెను. పరిమళ వక్కపొడికి మాయిల్లు పేరుగాంచియుండెను. తిరువళ్ళూరు కుంభకోణముల చిగురు తమలపాకులను వాడుచుంటిని, బొజ్జకు శ్రీగంధమును పూయుచుంటిని. తిలకము రకరకముగ దిద్దుచుంటిని.

మద్రాసులో నాకు వైశ్యులతో సహవాస మొక్కువగుటచేత, నా వేషము పటాటోపముగ నుండెను. ఆ కాలమున వెడల్పాటి సరిగ దుప్పటాలకు ప్రాముఖ్యత కలిగియుండెను. ఆరణి చాకులెట్టు బొద్దంచు